రాజకీయాలు లేదా మరే రంగంలోనైనా ‘పబ్లిక్ రిలేషన్స్’ చాలా ముఖ్యం. చక్కగా, ఆప్యాయంగా మాట్లాడటం, ఇతరులు చెప్పేది ఆసక్తిగా, ఓపికగా వినడం. కాస్త చిర్నవ్వు, ఐ కాంటాక్ట్, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం వంటివి వ్యక్తుల గౌరవాన్ని పెంచుతాయి.
అలాగే భాషపై పట్టు ఎంత ముఖ్యమో మంచి వాక్చాతుర్యం కూడా అంతే ముఖ్యం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు భాషపై పట్టునే వాక్చాతుర్యమనే భ్రమలో అనవసరమైన మాటలు మాట్లాడేస్తూ వివాదాలలో చిక్కుకుంటారు.
ఇలాంటి నోటి దురద కారణంగా బంధుత్వాలు, స్నేహాలు చెడగొట్టుకుంటున్నవారు కనిపిస్తూనే ఉంటారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులైతే పోలీస్ కేసులు, పరువు నష్టం దావాలను కూడా ఎదుర్కొంటున్నవారు లేదా ఉన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ సామాన్య ప్రజలు మొదలు పాఠశాల విద్యార్ధుల వరకు అందరితో అప్యాయంగా వ్యవహరిస్తారో చూస్తున్నప్పుడు ‘పబ్లిక్ రిలేషన్స్’ ఏవిధంగా ఉండాలో వివరిస్తున్నట్లే ఉంటుంది.
ఆ హోదాలో ఉన్నవారు సామాన్యుల భుజంపై చెయ్యేసి ఆప్యాయంగా మాట్లాడే రెండు ముక్కలు వారి పట్ల గౌరవం పెంచుతాయి. ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇది అర్ధమవుతుంది.
ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు బాలికలు నృత్య ప్రదర్శనకు వచ్చి నిలబడినప్పుడు మంత్రి నారా లోకేష్ అక్కడికి వచ్చారు.
పోలీసులు ఆ బాలికలను, వారికి తోడుగా వచ్చిన వారిని పక్కకి జరిపి అడ్డుగా నిలబడ్డారు. ఇది గమనించిన మంత్రి నారా లోకేష్ వారి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వారితో సెల్ఫీ దిగారు.
అయనే స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించి తమతో సెల్ఫీ దిగడంతో వారి మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. మంత్రి నారా లోకేష్ చిన్న పలకరింపు, ఓ సెల్ఫీ వారిపై, ఈ వీడియోని చూసినవారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేరే చెప్పక్కరలేదు.
#Mangalagiriలో cutest moment!
Dance performanceకి ready అయిన ఓ చిన్నారి selfie తీసుకుంటుండగా… @naralokesh స్వయంగా వచ్చి frameలో join అయ్యారు.
Her smile says it all! pic.twitter.com/2AXIt4vfb7
— M9 NEWS (@M9News_) July 18, 2026




