
జోతిష్యం పేరుతో జాతకాలు చెప్పుకుంటూ, కాంట్రవర్సీ లు సృష్టిస్తూ వేరొకరి జీవితాలను బజారుకీడుస్తూ పైశాచిక అనందం పొందుతున్నారు వేణు. భవిష్యత్ ను ముందుగానే ఉహించగలను అని చెప్పి బొక్కబోర్లా పడినప్పటికీ వెనులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
జ్యోతిషుడిగా తన దగ్గరకు వచ్చిన వారి జాతకాలే కాకుండా సెలబ్రెటీల జీవితాలను, రాజకీయ నాయకుల గెలుపోటములను, క్రీడా కారుల జయాపజయాల మీద కూడా పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతూ భంగపాటు ఎదుర్కొన్నప్పటికీ ఆయనలో ఇసుమంత పచ్చాత్తాపం కానీ లేదు.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
మొన్న ఏపీ లో వైసీపీ పార్టీ రూలింగ్ లోకి వచ్చి మరోసారి జగన్ అవుతారు అంటూ రెచ్చిపోయారు. అంతకు ముందు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది, కేటీఆర్ కు ముఖ్యమంత్రి గా పట్టాభిషేకం జరిగి తీరుతుంది అంటూ శపధాలు చేసారు. అలాగే ఐపిల్ లో హైద్రాబాద్ సన్ రైజెస్ ఎట్టిపరిస్థితులలోనూ కప్పు గెలుచుకుంటారు అంటూ నానా హంగామా చేసారు.
అయితే వీటిలో ఏ ఒక్కటి వాస్తవ రూపంలోకి రాకపోవడంతో ఇక జాతకాల జోలికెళ్లను, జోతిష్యాల ఊసెత్తని అంటూ నంగనాచి కబుర్లు చెప్పిన వేణు తాజాగా మరో కాంట్రవర్సీకి తెర లేపారు. నాగ చైతన్య, శోభిత ల నిచ్చితార్థం సందర్భంగా మరోసారి తన గబ్బు నోటికి పనిచెప్పారు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
నాగచైతన్య, సమంతల వివాహ బంధం నిలబడదని తానూ ముందే చెప్పానని, అదే జరిగిందని, ఇప్పుడు కూడా చై, శోభితల బంధం కూడా ఎక్కువకాలం కలిసి ఉందంటూ ఆదిలోనే అంతం అంటూ అశుభం పలికి కొత్త జంట కు ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి చెక్ పెట్టారు.
అయితే దీని మీద స్పందించిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అస్సోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అస్సోసియేషన్ వేణు మీద కేసు నమోదు చెయ్యాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో తన నోటికి వచ్చింది వాగుతూ సెలబ్రెటీలు కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే వారికీ ఇది ఒక మంచి గుణపాఠంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
అయినా ఎవరో జాతకం చెప్పారు కదా మనం విడిపోవాలి అని ఎవ్వరు విడిపోరు, అలాగే విడిపోతారు అని వేణు ముందుగా చెప్పలేదు కాబట్టి మనం కలిసే ఉందాం అని ఎవ్వరు తమకు ఇష్టం లేకున్నా కలిసి జీవించారు. ఎవరికీ వారికీ కలవడానికి, విడిపోవడానికి వారి వారి వ్యక్తిగత కారణాలు ఉంటాయి.
వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టి వాటి పై చర్చలు చేపట్టి వేణు లాంటి వారు తాము సెలబ్రేటీలుగా మారుతున్నారే తప్ప సమాజానికి మేలిమి చెయ్యడం లేదు.పేరు ముందు స్వామి అని పెట్టుకున్నంత మాత్రాన అందరు స్వాములు అయిపోరు. అలాగే పేరు చివర బాబా అని తగిలించుకున్నంత మాత్రాన అందరు షిరిడి సాయి బాబాలుగా మారిపోరు.
నిజంగా వేణు కి భవిష్యత్ తెలిసి ఉంటే అది ముందుగానే వారికీ చెప్పి వారిని ఇప్పటి నుంచే అభద్రతా భావంలో బతికేలా చెయ్యరు. కేవలం నెగిటివ్ ను మాత్రమే ప్రచారం చేస్తూ తన ఉనికి కాపాడుకోవాలి అనుకునే వాడికి ఎప్పటికి భవిష్యత్ ఉండదు.
ఇప్పటికే సమాజంలో మతాల పేరుతో, ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకుని దొంగ బాబులుగా చెలామణి అవుతున్న వారు కోట్లు వెనకేసుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ప్రజలను రోడ్డుపాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి వారివల్ల సనాతన ధర్మం పట్ల సమాజంలో అపనమ్మకం పెరిగిపోతుంది.
ఇక ఇలా పుట్టగానే చావు వార్త చెప్పి, పెళ్లితో ఒకటవుతున్నారు అనగానే విడాకులతో ఇద్దరు వేరవుతారు అంటూ వ్యక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వేణు లాంటి వారిని చూసి సమాజం ఎం నేర్చుకుంటుంది. అందుకే ఈయన స్వామి కాదు శాడిస్టు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.