కోడెలపై దాడి పలనాడులో టీడీపీకి మేలు చేసిందా?

Attack on Kodela Siva Prasad benefits to TDPనవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా చరిత్రపుటల్లో నిలిచిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై పోలింగ్‌ రోజున సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. వైకాపా ప్రాబల్యం ఎక్కువ ఉండే గ్రామం కావడం, రిగ్గింగుకు ఎక్కువ ఆస్కారం ఉండటంతో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన కోడెలపై దాడికి తెగబడారని స్థానికులు విశ్లేషిస్తున్నారు. కోడెల పై దాడి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు మేథావులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ సాగుతుంది. అధికారంలోకి రాక ముందే వీరి దూకుడు ఇలా ఉంటే, అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం పల్నాడు వాసులు వ్యక్తం చేసారని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కోడెలపై దాడి జరిగితే గంట వ్యవధిలోనే ఈ విషయం రాష్ట్రం మొత్తం పాకింది. దీంతో అప్పటి వరకు ఈవీఎంలు పని చేయడం లేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్న చాలా మంది పెద్ద ఎత్తున ఓటింగ్‌కు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

దీని ప్రభావం పలనాడు ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని టీడీపీవారు విశ్లేషిస్తున్నారు. అయితే వైకాపా వారు దాడి జరగగానే కోడెలపై స్థానికులు దాడి చేశారని, ఐదేళ్లుగా ఆయన ప్రజలను పీక్కుతినడం వల్లే అలా చేశారని పుకార్లు వ్యాపింపచేశారు. దీనివల్ల టీడీపీకే నష్టం జరిగిందని వారు చెబుతున్నారు. మరి ఇందులో ఎవరి వాదన నిజం అనేది తేలాలంటే మే 23వరకూ ఆగాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో స్పీకర్ గా పని చేసిన వారు ఎన్నికలలో గెలవరనే ఒక సెంటిమెంటు ఉంది. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూడా అక్కడి స్పీకర్ ఓడిపోయారు. దీనితో కోడెల ఏం చేస్తారు అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories