avanthisrinivasarao-jagan

గంట, అరగంట, కోడీ గుడ్డూ, బటన్.. వంటి పదాలు పాపులర్ అవుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ జగన్‌ పుణ్యమాని అయ్యాయి. అర గంట మంత్రిగా పాపులర్ అయిన అవంతీ శ్రీనివాస్ గురువారం వైసీపీకి రాజీనామా చేశారు.

“వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, కనుక భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజినమా చేస్తున్నాను,” అని అవంతి శ్రీనివాస్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!

అవంతి శ్రీనివాస్ మంత్రిగా రాష్ట్రానికి, నియోజకవర్గానికి చేసిందేమీ కనబడదు. విశాఖ జిల్లాలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో ఆయన ప్రాతినిధ్యం వహించిన భీమిలి కూడా ఒకటి.

అవంతి శ్రీనివాస్ మంత్రిగా పనిచేసినా భీమిలిని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేయకుండా, తన విద్యా వ్యాపారాలు, రాజకీయాలతోనే కాలక్షేపం చేశారు. కనుక ఆయన వలన భీమిలి ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ లేదు. రాజీనామా చేసినందున ఇప్పుడు ఆయన అవసరం పార్టీకి కూడా లేదు.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

అవంతి తన రాజీనామా లేఖలో ‘ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని’ చెప్పారు. కానీ బహుశః మెడకు కేసులు చుట్టుకోకుండా ఉండేందుకు దూరంగా ఉంటానని చెపుతున్నారేమో?

కానీ ఆయన రాజకీయాలకు దూరం ఉండే వయసు, సమయం రెండూ కావు. కనుక వైసీపీకి రాజీనామా చేసిన వారందరికి ఏకైక గమ్యంగా కనిపిస్తున్న జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారేమో?

Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?