‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ విడుదల తేదీ!

Baahubali 2 First Look, Baahubali 2 First Look Release, Baahubali 2 First Look Release Date, Baahubali 2 Movie First Look Release Date Detailsప్రస్తుత కాలంలో సినిమా పబ్లిసిటీ అంటే ‘ఫస్ట్ లుక్’తో మొదలై, ఫస్ట్ డే టాక్ తో ఎండ్ అవుతోంది. దీంతో ఆడియన్స్ ను బుట్టలో పడేసేందుకు ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కీలకంగా మారింది. ఒక విధంగా సినీ అభిమానులు కూడా ప్రతిష్టాత్మక సినిమాల ఫస్ట్ లుక్ లపై విపరీతమైన ఆసక్తిని కనపరుస్తున్నారు. మరి అలాంటి ప్రతిష్టాత్మక సినిమాలలో అగ్ర స్థానంలో ఉండే “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు విడుదల అవుతుంది? అంటే ప్రస్తుతం దానికొక సమాధానం లభిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 23వ తేదీన “బాహుబలి – ది కన్ క్లూజన్” ఫస్ట్ లుక్ ను పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో పబ్లిసిటీని ఈ సంవత్సరం చివర నుండి ప్రారంభిస్తే సరిపోతుందన్న వ్యూహరచనలో భాగంగా యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజును అందుకు వేదికగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అదీ గాక, ‘బాహుబలి – ది బిగినింగ్’ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ తేదీ నుండే ప్రారంభం కావడం విశేషం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories