“బాహుబలి 2” 1000 కోట్లుపై రాజమౌళి మాట!

baahubali-2-collectionsభారీ అంచనాలున్న ‘బాహుబలి’ సినిమా ఎవరి ఊహలకు అందకుండా ఏకంగా 600 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో… ‘బాహుబలి 2’ సినిమా ఎంత వసూలు చేస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాల మాట అయితే… ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలి 1000 కోట్లు వసూళ్లు చేసే చిత్రంగా “బాహుబలి 2” నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నపై అసలు రాజమౌళి ఏమనుకుంటున్నారు? అంటే దానికి సమాధానం వచ్చింది.

‘బాహుబలి 2’కు సంబంధించిన తొలి అధికారిక ప్రెస్ మీట్ సందర్భంగా… ఈ సినిమా లోగోను విడుదల చేసిన జక్కన్న… పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా… ‘బాహుబలి 2’ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే… ‘బాహుబలి 2’ ఎంత కలెక్ట్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేమని, ఊహను వదిలి వాస్తవాన్ని పెట్టి ఆలోచిస్తే… ‘బాహుబలి’ ఎంత వసూళ్లు చేసిందో, దానికి ఓ 30 శాతం అదనంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

ADVERTISEMENT

అంటే 600 కోట్ల మీద 30 శాతం అంటే దాదాపుగా 800 కోట్లకు చేరవచ్చు. 30 శాతం అదనం అన్న రాజమౌళి, బాలీవుడ్ మాత్రం టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలవాలని ఆశిస్తున్నారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మొదటి 10 సినిమాల్లో ఒకటిగా ‘బాహుబలి 2’ ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలిపారు. అయితే ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నట్లు కాకుండా… దాని కంటే తక్కువ సంఖ్యను చెప్పి, మరోసారి తన మార్క్ మాట తీరుతో రాజమౌళి ఆకట్టుకున్నారని అభిమానవర్గం ప్రశంసలు కురిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories