పండగ చేసుకుంటున్న ‘బాబు బంగారం’

Babu Bangaram,Babu Bangaram Box Office Records,Venkatesh Babu Bangaram Box Office Records,Babu Bangaram Box Office Movie Recordsప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన “బాబు బంగారం” మినహా పెద్ద సినిమాలేవీ లేవు. వెంకీ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సంపాదించుకున్న ఈ సినిమాకు విమర్శకుల కలం పెద్ద పనే చెప్పింది. అయితే సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ విభాగం వర్కౌట్ కావడంతో, ప్రేక్షకులు ఆదరణకు నోచుకుంది. వారం రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసిన ‘బాబు బంగారం’కు ఈ వారం విడుదలైన ‘చుట్టాలబ్బాయ్, ఆటాడుకుందాం… రా…’ సినిమాలు బ్రేక్ వేస్తాయని భావించారు.

అయితే ఈ రెండు సినిమాలకు సినీ విమర్శకుల నుండి మాత్రమే కాకుండా, సినీ ప్రేక్షకుల నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాల ప్రభావం పెద్దగా ఉండదన్న విషయం తేలిపోయింది. రెండు సినిమాలు కూడా రొటీన్ అండ్ బోరింగ్ కమర్షియల్ సినిమాలన్న అంశాన్ని సినీ విశ్లేషకులు తేల్చేయడంతో, “బాబు బంగారం” హవాకు మరో వారం రోజుల పాటు అడ్డు లేకుండా పోయింది. ఈ వారం రోజులు కూడా అదే రన్ కొనసాగితే, బంగారం సినిమాకు లాభాల పంట ఖాయమన్నది ట్రేడ్ పండితుల మాట.

ADVERTISEMENT

ఏకైక పెద్ద సినిమాగా ‘బాబు బంగారం’ చెలరేగుతుంటే, అతి చిన్న సినిమాగా విడుదలైన ‘పెళ్ళిచూపులు’ పెద్ద సినిమాలను మించిపోయే విజయాన్ని సాధించింది. ‘బాబు బంగారం’ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతున్న “పెళ్ళిచూపులు” సినిమాకు కూడా ఎలాంటి ఆటంకాలు కలుగజేయలేదు నేడు విడుదలైన రెండు సినిమాలు.

ADVERTISEMENT
Latest Stories