బాలయ్య అభిమానులు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది

balakrishna anilravipudi movie updateనిన్న మార్చి 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నారని ప్రకటించారు. అనిల్ రావిపుడితో కలిసి బాలకృష్ణ చెయ్యబోయే తమ తదుపరి చిత్రం అధికారిక ప్రకటన కానున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. గతంలో ఈ సినిమాకు రామారావు గారు అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

కావున ఆ రోజున ఈ సినిమాను ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అనిల్ రావిపుడి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కాబట్టి నందమూరి అభిమానులు దీని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ఆ ప్రాజెక్టు కు సంబంధించి కాదని తేలిపోవడం పూర్తిగా నిరాశకు లోనవుతున్నారు.

ADVERTISEMENT

బాలకృష్ణ శ్రీరామ దండకం సొంతంగా పాడి… తన తండ్రి జన్మదినం సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక బహుమతిగా విడుదల చేస్తారని ప్రకటించారు. ఈ పాట మే 28 న (అంటే రేపు) ఉదయం 9.45 గంటలకు విడుదల కానుంది. గత సంవత్సరం, బాలకృష్ణ ‘జగదేకవీరుని కథ’ లోని ‘శివ శంకరి’ పాటను పాడి విడుదల చేశారు.

ఇకపోతే రేపటి రోజున బాలకృష్ణ అఖండ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. మొన్న ఆ మధ్య విడుదలైన సినిమా టీజర్ తో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి.

ADVERTISEMENT
Latest Stories