నందమూరి నటసింహం బాలకృష్ణ హౌస్ అరెస్ట్!

balakrishna-pa-sekhar-hindupuram-mlaతెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ పై గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ప్రజలతో పాటు, పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్ ను హౌస్ అరెస్టు చేశారు. హిందూపురంలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ పీఏ వ్యవహారం కేవలం హిందూపురం నియోజకవర్గానికే కాకుండా ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ప్రభావం బాలకృష్ణ ఇమేజ్ పై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో శేఖర్ ను దూరంగా పెట్టనున్నట్టు తెలుస్తోంది. పీఏ శేఖర్ తీరుపై హిందూపురం టీడీపీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఏ పదవి నుంచి శేఖర్ ను తప్పించకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని బాలకృష్ణకు ఇప్పటికే వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్యను బాలయ్య ఎలా పరిష్కరిస్తారో గానీ, బాలయ్య పీఏ వ్యవహారం గత కొన్ని రోజులుగా మీడియా వర్గాలలో ప్రధానంగా హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories