ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలోని హిందూపురంలో తెలుగుదేశం పార్టీ డేంజర్ లో పడిందన్న సంకేతాలను పొలిటికల్ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. బాలకృష్ణ ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తిగత సహాయకుడు శేఖర్ ద్వారా బాలకృష్ణకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతూ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్నట్టు తాజాగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేఖర్ ఆగడాలు భరించలేని నేతలు కార్యకర్తలు మండలాల వారీగా సమవేశాలు ఏర్పాటు చేసుకుని, మరీ శేఖర్ తీరుపై చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
హీరోగా బిజీగా ఉండే బాలకృష్ణ రెండు నెలలకు ఓ సారి తన నియోజకవర్గానికి వచ్చిపోతుంటారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం కష్టంగా ఉండడంతో చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్ అనే ఉద్యోగిని తన ప్రతినిధిగా ఇక్కడ నియమించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, తనకు మధ్య అనుసంధానకర్తగా శేఖర్ ఉంటాడని బాలకృష్ణ భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. శేఖర్ ఇప్పుడు నియోజకవర్గంలో కీలకంగా మారిపోయారు. తనకు భద్రత కోసమంటూ గన్ మెన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన మాట వినని వారిపై వేటు వేస్తున్నారు. పార్టీ శ్రేణులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
2015లో చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన శేఖర్ మండల తెలుగు రైతు అధ్యక్షుడి పైన కూడా వేటు వేసారు. హిందూపురం మాజీ కౌన్సిలర్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. కాంట్రాక్టులు, కమీషన్లతో చెలరేగిపోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఘటనను ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు. తనకు కప్పం కట్టలేదని లేపాక్షి మండలం కొండూరుకు చెందిన టీడీపీ నేతతో బహిరంగంగానే గొడవకు దిగి చొక్కాలు పట్టుకున్నారని అంటున్నారు.
శేఖర్ తీరుతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసి తమ సమస్యను వివరించలేని వారు, శేఖర్‌ను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు కూడా కష్టాలు పడుతున్నారు. అయితే ఆయన దర్శనం కావాలంటే ముగ్గురి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షాడో ఎమ్మెల్యే తమకు వద్దంటూ నియోజకవర్గంలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మరీ శేఖర్ ఆగడాలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన సమావేశానికి 90 శాతానికి పైగా పార్టీ శ్రేణులు హాజరవడం శేఖర్ ఆగడాలకు నిదర్శనమని చెబుతున్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ కళ్లు తెరవకపోతే అనంతపురంలో పార్టీకి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



