బాలయ్య దీపావళి గిఫ్ట్ కు అభిమానులే గగ్గోలు

Balakrishna Ruler releasing on 20th decemberనందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ కంఫర్మ్ చేశారు. అలాగే డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. కాసేపటి క్రితం చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ని చిత్రబృందం దీపావళి సందర్భంగా రిలీజ్ చేసింది.

బాలయ్య పోలీసు గెట్ అప్ లో ఒక పెద్ద సుత్తి పట్టుకుని ఉన్నాడు. గుబురు గెడ్డం, మీసంతో ఉన్నారు. అయితే పోస్టర్ కు నెగటివ్ రెస్పాన్స్ వస్తుంది. విగ్ అసలు బాలయ్య సూట్ కాలేదు. పోస్టర్ డిజైన్ కూడా చెత్తగా ఉందని అభిమానులే అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లతో చిత్రానికి బాడ్ ప్రమోషన్ వచ్చింది. అసలే హైప్ లేని ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏం చెయ్యబోతుందో చూడాలి.

ADVERTISEMENT

ఈ వారంలో రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ లో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. క్రిస్మస్ కు సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే, రవితేజ డిస్కో రాజా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాకు పోటీ కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories