జబర్దస్త్ షోలోకి బండ్ల గణేష్

Bandla Ganesh as jbardasth comedy show judge తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కామెడీ షో ‘జబర్దస్త్’. తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన షో ఇది. ఈ షోకు మరో ప్రధాన ఆకర్షణ న్యాయనిర్ణేతలు రోజా, నాగబాబు. ముఖ్యంగా నాగబాబు షోకు మెయిన్ పిల్లర్‌గా ఉన్నారు. ఆయన నవ్వుకి, స్కిట్ మధ్యలో వేసే పంచ్‌లకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఈ షో నుంచి నాగబాబు వైదొలుగుతున్నారని సమాచారం. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్‌లలో మాత్రమే నాగబాబు కనిపిస్తారని.. అవి టెలీకాస్ట్ చేయడం పూర్తయితే మరో కొత్త జడ్జ్ వస్తారని అంటున్నారు. షో డైరెక్టర్లకు షో ప్రొడ్యూసర్స్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ కు గొడవ జరిగిందంట. డైరెక్టర్లకు మద్దతుగా నాగబాబు షో నుండి తప్పుకున్నారట.

ADVERTISEMENT

నాగబాబుకు బదులుగా బండ్ల గణేష్, అలీ, సాయికుమార్ లతో షో నిర్వాహకులు చర్చలు జరిపారట. అలీ జగన్ ప్రభుత్వంలో ఏదైనా పదవి వస్తుంది అనే ఆశతో ఒప్పుకోలేదట. సాయికుమార్ రెడీ గా ఉన్నా ఆయన షోకు కొంత సీరియస్ నెస్ తెస్తారని ఆయనను కన్సిడర్ చెయ్యడం లేదట. దీనితో వారు బండ్ల గణేష్ వైపు మొగ్గు చూపుతున్నారట.

బండ్ల గణేష్ లో కొంత కాంట్రోవర్సియల్, కొంత కామిక్ టచ్ ఉండటం ఆయన కరెక్టు అనుకుంటున్నారట. ఇటీవలే కొన్ని ఆర్ధిక కేసులలో బండ్ల జైలుకు వెళ్ళొచ్చాడు. అదే క్రమంలో చాలా కాలం తరువాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories