మెగా నిర్మాతపై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్!

Bandla Ganesh - Pawan Kalyan Postersఅభిమానం ఉండొచ్చు గానీ, అది హద్దులు దాటితే వెగటు పుడుతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గుర్తించినట్లునారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ శుభాకాంక్షలు చెప్తూ ‘బ్లాక్ బస్టర్’ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఓ ఫోటోను పోస్ట్ చేసారు. శివుని ఫోటోను మార్ఫింగ్ చేసి, ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ముఖం పెట్టి ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

నిజానికి ఇలాంటి ఫోటోలు అభిమానులకు మంచి ఉత్సాహాన్నిస్తాయి. కానీ, ఇక్కడ విశేషమేమిటంటే… పవన్ ఫ్యాన్స్ కూడా బండ్ల గణేష్ తీరుపై మండిపడుతున్నారు. బండ్ల గణేష్ మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఏదైనా ఒక లిమిట్ లో ఉండాలని, దేవుడితో గేమ్స్ వద్దంటూ… ఇలా రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తీకరిస్తూ, సదరు ఫోటోను డిలిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories