ట్రైలర్ టాక్ – మరో ‘రక్తచరిత్ర’

Bhairava Geetha Trailer Talkరాంగోపాల్ వర్మ ప్రజెంట్ చేస్తూ, ఆయన శిష్యుడు సిద్ధార్థ దర్శకత్వం వహించిన “భైరవగీత” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. ‘అరవింద సమేత’కు పోటీగా విడుదల చేస్తానని చెప్పి, ప్రచారం పొంది తర్వాత వెనక్కి తగ్గిన వర్మ, ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయబోతున్నామని ఈ ట్రైలర్ ద్వారా ప్రకటించారు.

[m9ad]

ADVERTISEMENT

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… వర్మ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో మరో “రక్తచరిత్ర”ను తలపించింది. ధనిక అమ్మాయి… పేద అబ్బాయి… వీరిద్దరి మధ్య ప్రేమ… వాటిని ఒప్పుకొని తల్లితండ్రులు… చివరికి ఎలా తమ ప్రేమను సాధించుకున్నారు? అసలు సాధించుకున్నారా? లేదా? అనేది ఈ చిత్ర ప్రధాన కధగా ట్రైలర్ స్పష్టం చేసేసింది.

కంటెంట్ పరంగా పర రొటీన్ గా కనపడుతున్నప్పటికీ, వర్మ మార్క్ ఇంటెన్సిటీ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రధాన ప్లస్ పాయింట్. కొత్త నటీనటులు ధనంజయ, ఇర్రా మోర్ లు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories