ఈ పోస్టర్ ఏంటి ‘లీడర్’లా ఉంది!

Bharat Ane Nenu - Mahesh Babu - Kiara Advaniఇప్పటివరకు ‘భరత్ అనే నేను’కు సంబంధించిన పోస్టర్లపై ప్రిన్స్ మహేష్ బాబు మాత్రమే దర్శనమివ్వగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కైరా అద్వానీ లుక్ ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన కైరా, మొదటి సినిమాతోనే మహేష్ బాబుతో అవకాశం లభించగా, ప్రిన్స్ పక్కన సెట్ అవుతుందా? లేదా? అన్న సందేహం అయితే నెలకొంది. అయితే వాటన్నింటిని పటాపంచలు చేసే విధంగా చిత్ర యూనిట్ స్టిల్ ను రిలీజ్ చేసింది.

ADVERTISEMENT

బ్లూ శారీలో ప్రిన్స్ పక్కన తళుక్కుమన్న కైరా లుక్ బాగుంది గానీ, ఈ పోస్టర్ ‘లీడర్’ సినిమాలో రానా అండ్ రిచా గంగోపాధ్యాయలను గుర్తుకు తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. సిఎంగా రానా నడిచి రావడం, ఆ వెనుకే కార్లు నిదానంగా వస్తుండడం… యాజిటిజ్ గా ‘లీడర్’ పోస్టర్ ను ఈ ‘భరత్ అనే నేను’ జ్ఞప్తికి తెచ్చింది. ఈ పోస్టర్ ఎలా ఉన్నా, ఆదివారం నాడు విడుదల కాబోయే రెండవ పాట కోసం అభిమానులు నిరీక్షిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories