ఫ్లాష్ ఫ్లాష్… “బాహుబలి” రికార్డులు బద్ధలయ్యాయి..!

Bichhagadu-Movie breaks baahubali recordsఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే చరిత్ర సృష్టించిన సినిమా “బాహుబలి.” 600 కోట్ల కలెక్షన్స్ దగ్గర నుండి కౌంటర్ దగ్గర ఎక్కువ టికెట్లు అమ్ముడైన దాని వరకు… ప్రతి విభాగంలో ఆల్ టైం రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ సినిమా, బుల్లితెరపై కూడా అదే స్థాయిలో సరికొత్త రికార్డులకు వేదిక అయ్యింది. దక్షిణాదిలోనే అత్యధిక టీవీ ప్రీమియర్ రేటింగ్స్ అందుకున్న “బాహుబలి” సినిమాను ఎవరు బద్దలు కొడతారో అని అంచనాలు వేసిన సినీ వర్గాలకు “బిచ్చగాడు” షాక్ ఇచ్చాడు.

ADVERTISEMENT

తెలుగు ‘బిచ్చగాడు’కు మాతృక అయిన తమిళ “పిచ్చైక్కారన్” సినిమా ఇటీవల బుల్లితెరపై ప్రదర్శితం కాగా, ఇప్పటివరకు నెలకొల్పి ఉన్న అన్ని బుల్లితెర రికార్డులను రూపుమాపి, తన పేరుతో లిఖించుకుందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ‘బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా’ అందించిన సమాచారం ప్రకారం… ఆల్ టైం దక్షిణాది టీవీ ప్రీమియర్ రేటింగ్స్ ను “పిచ్చైక్కారన్” సొంతం చేసుకుని, ‘బాహుబలి’ని రెండవ స్థానానికి నెట్టిందని సమాచారం.

ఒక చిన్న సినిమా వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో, బుల్లితెరపై కూడా అదే స్థాయిలో రికార్డులను పటాపంచలు చేయడం చెప్పుకోదగ్గ విషయం. అంతటి విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా సిద్ధమవుతోందని, ఈ సారి ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్లాక్ మనీని టార్గెట్ చేసుకుని ‘బిచ్చగాడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సినీ వర్గాలలో హల్చల్ చేసిన సమాచారం నెటిజన్లకు సుపరిచితమే.

ADVERTISEMENT
Latest Stories