గుజరాత్ ఊపుతో బీజేపీ 2019 ఏపీ హీరో అవుతుందట!

Somu Veerraju BJP Gujarat Elections 2017గుజరాత్‌ అసెంబ్లీ ఫలితాలతో విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఎప్పుడు వేరే రాష్ట్రాల్లో విజయాలనే జరుపుకునే ఏపీ బీజేపీ పెద్దలు గుజరాత్ విజయంతో ఉబ్బితబ్బిబైపోయి భారీ ప్రకటనలు చేసేస్తున్నారు.

ADVERTISEMENT

2019 ఎన్నికల్లో ఏపీలో తామే హీరోలమవుతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఈ ఫలితాలు ఏపీ, తెలంగాణను ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించారు. బీజేపీ ఓడిపోతుందని భావించిన నేతలకు ఈ ఫలితాలు చెప్పు దెబ్బవంటివి అన్నారు. వీర్రాజు ఉత్సాహానికి ఆయన పక్కన ఉన్నవారే ఉలిక్కిపడ్డారు.

గుజరాత్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమన్నారు. అదే తమని 2019లో తమను ఏపీకి హీరోలను చేస్తదని వీర్రాజు ఆశ. అయితే గ్రౌండ్ లెవెల్ లో ఎలాంటి పని చెయ్యకుండా ఢిల్లీలోని మోడీ వచ్చి తమను గెలిపిస్తాడు అనుకోవడమే ఏపీ బీజేపీ బలహీనతగా చెప్పుకోవచ్చు. అయినా మాటలు కోటలు దాటించడంలో వీర్రాజుని మించినవారు లేరు.

ADVERTISEMENT
Latest Stories