పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు ఉంది రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకుని రాలేరు గానీ కేంద్రానికి వంత పాడతారు. గత నాలుగేళ్ళుగా ఆంధ్రా కు కేటాయించిన భారీ నిధులు, విభజన చట్టం అమలు తీరు గమనిస్తే ఎన్.డి.ఎ ప్రభుత్వ అంకిత భావం తెలుస్తుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు హరిబాబు చెప్పుకొచ్చారు.
“నాటి రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినప్పటికీ నాటి యు.పి.ఎ ప్రభుత్వం చట్టంలో పెట్టలేదు. ఒక వేళ పెట్టి ఉంటే ఆర్దిక సంఘం సిఫార్సులు వచ్చినా చట్టంలో ఉన్నదాన్ని తప్పనిసరిగా అమలు చేయల్సివచ్చేది,” అని ఆయన కాంగ్రెస్ పైకి నెపం మోపే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ఏమి వెలగబెట్టలేదు అనే కారణంగానే కదా రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు గుండు సున్నా వేసింది. దేశవ్యాప్తంగా బీజేపీకి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టింది. అయినా మేము ఏమి చెయ్యలేము అంటే ఇంక వీళ్ళను గెలిపించడం ఎందుకో? ఇటువంటి మాటలు మాట్లాడానికి సిగ్గుగా లేదా హరిబాబుగారూ!



