ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి పోటీ పడుతున్నారు. చంద్రబాబుని తిడితే తెలుగుదేశానికి చెందిన ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేయొచ్చు అని వారు ఎలా అనుకుంటున్నారో తెలీదు గానీ… దానిని గట్టిగా నమ్మి అదే ప్రయత్నంలో ఉంటున్నట్టుగా కనిపిస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి రాయలసీమకు నీళ్లు ఇవ్వకపోవడంపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వినమ్రంగా అభ్యర్ధించి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఘాటుగా విమర్శించారు. “జగన్ గారు… శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తేశారు.నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు,పులిచింతల నిండిపోయింది.ప్రకాశం బ్యారేజ్ గేట్లెత్తేసి..సముద్రంలోకినీళ్లువదులుతున్నారు. అయితే రాయలసీమలో ఆ స్థాయిలో వర్షం పడటం లేదు,రాయలసీమ మీద జాలి చూపితే ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు,” అంటూ అభ్యర్ధించారు.
అదే సమయంలో చంద్రబాబు ని అడుగుతూ.. “రాయలసీమకు హై కోర్టు ఇస్తే బాధ, రాయలసీమ పెట్టాల్సిన వాటిని అమరావతికి ఐదేళ్ల పాటు తరలించుకుపోయారు.ఇప్పుడు సీమలో స్టోర్ అవుతున్న నీళ్లకు కూడా రాయలసీమకు దక్కనీయకూడదన్న మిమ్మల్ని చూస్తుంటే సగటు రాయలసీమ వాసి అసహనం కలిగితే బాధ్యత మీది కాదా?,” అంటూ విమర్శించారు.
రాయలసీమకు నీళ్లు దక్కకుండా ప్రతిపక్షంలోని చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం ఈ మధ్య కాలంలో ఎమన్నా జరిగింది అంటే అది చంద్రబాబు హయాంలోనే. పట్టిసీమ కట్టిందే శ్రీశైలం నుండి వదిలే జలాలను మిగిల్చి ఆ నీటిని రాయలసీమకు మళ్ళించడానికి. ఆ మాత్రం కనీస జనరల్ నాలెడ్జ్ లేకుండా అధికార పక్షాన్ని ప్రశ్నించే ధైర్యం లేకుండా ప్రతిపక్షం మీద విమర్శలు చెయ్యడమేంటో?



