దక్షిణాదిన బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపించగలిగే రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. అనూహ్యంగా అక్కడ అధికారం కోల్పోయిన బీజేపీ ఇప్పుడు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కుదేలయ్యిపోయింది. నేడు వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది దీనితో కమలనాధులలో భయం మొదలయ్యింది.
[m9ad]
9 సిటీ పురపాలక సంస్థలు, 53 పట్టణ పురపాలక సంస్థలు, 23 నగర పంచాయతీల్లోని వార్డులు, మైసూరు, తమకూరు, శివమొగ్గ నగరపాలికల్లోని 135 వార్డులు అన్ని కలిపి మొత్తం 2,709 వార్డుల్లో ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. బీజేపీ రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వం వల్ల భాజపా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని, అయితే 2019లో ఇలా జరగబోదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. కర్ణాటకలో బీజేపీ 2014 ఎన్నికలలో 17 సీట్లు సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో 2019లో పరిస్థితి ఎలా ఉండబోతుందో అని వారు ఆలోచనలో పడ్డారు.



