తమిళనాడులో జరిగిన జల్లికట్టు పోరాటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. టీడీపీ – బీజేపీ విడిపోవాలన్నదే ఇక్కడి ప్రతిపక్షాల వ్యూహమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడలేదని, అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని తన సత్తా గురించి ప్రశ్నించే ముందు, సదరు నాయకులు నాడు వారి పత్తా ఎక్కడుందో చెప్పాలని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. జల్లికట్టు ఆట సంవత్సరానికి రెండు, మూడు రోజులు ఆడుకుంటారని, దానిపై పన్నీర్ సెల్వం ఢిల్లీకి వస్తే… ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారని, దీనిని అడ్డు పెట్టుకుని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం సమంజసం కాదని అన్నారు.
ముఖ్యంగా జల్లికట్టు విషయాన్ని ముడిపెట్టి దక్షిణాది వారిపై ఉత్తరాది వారి పెత్తనం అంటూ కొందరు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు, నిధులు వస్తున్నాయని ఆ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని, ఏదైనా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఉరికే విమర్శలు చేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



