ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనవరి 6న మంగళగిరిలో ఒక భారీ బహిరంగసభకు హాజరయ్యి ప్రసంగిస్తారు. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాకా ప్రధాని ఏపీకి రావడం ఇదే తొలి సారి. ఈ క్రమంలో బిజెపి ఎమ్మెల్యే ,మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కొత్త డ్రామాకు దారి తీశారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ నమ్మక ద్రోహం చేసిందని జిల్లాకు పిషింగ్ హార్బర్ వంటి పలు వాగ్దానాలను పట్టించుకోలేదని, తాడేపల్లిగూడెం కు ఏభైఆరు హామీలు ఇచ్చి అమలు చేయకుండా టిడిపి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
[m9ad]
ప్రభుత్వ వైఖరి కి నిరసనగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తాడేపల్లి గూడెం అబివృద్దికి తాను అడ్డు అని భావిస్తే,ఈ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ను కోరారు. దీనికి కూడా చంద్రబాబు స్పందించకపోతే తాను నిరవధిక దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. అంత చిత్తశుద్ధి ఉంటే రాజీనామా లేఖ స్పీకర్ కు డైరెక్టుగా పంపాలి కానీ ముఖ్యమంత్రికి పంపడమేంటో? మాణిక్యాలరావు కొద్ది నెలల క్రితం వరకు చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్నారు.
అధికారం అనుభవించాకా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొత్త డ్రామాకు తెర లేపినట్టు ఉన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదు దానిపై మాత్రం బీజేపీ నేతలు నోరు మెదపరు. పైగా రాష్ట్రానికి అన్నీ చేసేశాం అని చెప్తారు కూడా. మోడీని ప్రసన్నం చేసుకోవడానికేనా ఈ రాజీనామా డ్రామా? మోడీని అమిత్ షాలకు బదులు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనులు చేస్తే వచ్చే ఎన్నికలలో కనీసం డిపాజిట్ అయినా దక్కుతుంది. ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో అక్కడి పార్టీ ప్రెసిడెంటు మూడవ స్థానంలో నిలిచారు. అక్కడి పరిస్థితి కంటే దారుణంగా ఉంది ఏపీలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు.



