అమరావతిపై మారుతోన్న బీజేపీ స్వరం!

BJP Somu Veerraju supports Amaravati farmers padayatraరాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని… అది ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయని… ఒకటి లేక మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా రాష్ట్రానిదేనని వివిధ సందర్భాలలో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన బీజేపీ స్వరం క్రమంగా మారుతోంది.

అక్కడ నుండి కట్ చేసి కరెంట్ సిట్యుయేషన్ కు వస్తే… అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గళం విప్పారు. ఇందుకు బీజేపీ కట్టుబడి ఉందని రైతులు చేస్తోన్న పోరాటంలో పాల్గొన్న సందర్భంలో తెలిపారు.

ADVERTISEMENT

అంతేకాదు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలోనే తాము నిర్మించబోతున్నట్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇలా సోము వీర్రాజు అమరావతిపై హామీలు ఇస్తున్న తరుణంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా పక్కనే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories