బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఇంటి అద్దె కడతారట!

BJP Telanganaతెలంగాణ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసే పనిలో పడింది. ఈ మేనిఫెస్టోలోని ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీని వెక్కిరిస్తుంది. సొంత ఇళ్లు లేకుండా అద్దెకుంటున్న వారికి ప్రభుత్వం ద్వారా నెలకు 5 వేలు చెల్లిస్తారట. దీనిపై సోషల్ మీద యువత జోకులు పేలుస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

ఇటువంటి అమోఘమైన ఐడియాలు రావడం వారికే చెల్లిందని, అందువల్లే ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎదుగుబదుగు లేకుండా పోయిందని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. మరోపక్క తాము చిల్లర పథకాలకు వ్యతిరేకం అంటూ కేంద్రంలోని బీజేపీ వారు గొప్పలకు పోతూ ఉంటారు. ఇక్కడేమో ఎవరికీ రాని వినూతనమైన ఆలోచనలకు వీరికి వస్తాయి.

మేనిఫెస్టోలోని ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాలుష్య నియంత్రణ కోసం.. కాలం చెల్లిన ఆటోలు, బడి బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ఉచితంగా సరఫరా చేసేస్తారట. డిగ్రీ, ఇతర ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తారట. ఎలాగూ అధికారంలోకి రారు కాబట్టి ఏమిస్తే ఏముందిలే!

ADVERTISEMENT
Latest Stories