కర్ణాటకను గెలవడానికి మతం కార్డు ప్రయోగిస్తున్న బీజేపీ

BJP using caste and religion in karnatakaసుప్రీంకోర్టు ఆదేశానుసారం రేపు బెంగళూరులో జరిగే బలనిరూపణకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. దీనికోసం ప్రముఖ లింగాయత్ మతగురువైన రంభపురి స్వామిని రంగంలోకి దించుతుంది. కాంగ్రెస్ జేడీఎస్ కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీవైపు తిప్పుతారని బీజేపీ నమ్మకం.

ADVERTISEMENT

మరోవైపు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ తిరుమల చేరుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా, ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శనం కోసం ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భాజపాకు, కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు మధ్య అధికారం కోసం పోరాటం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడకు ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories