అవును..నిజమే…ఇదేదో ఒక ఇండస్ట్రీకి…మరో ఇండస్ట్రీకి మధ్య వ్యత్యాసం కాదు. ఒకప్పుడు తెలుగు సినిమాకి, తెలుగు సినిమా వాళ్ళకి బాలీవుడ్ లో పెద్దగా గౌరవం ఉండేది కాదు. కానీ రోజులు పూర్తిగా మారాయి. తెలుగు సినిమాలో చాన్స్ కోసం హిందీ తారలు క్యూ కట్టడం మొదలయ్యింది అంటే అతిశయోక్తి కాది.
[m9ad]
నిజమే ఇదంతా కల కాదు, పచ్చి నిజం, ఈ నిజానికి విజయాన్ని అందించిన ఘనత మాత్రం అటు బాహుబలితో రాజమౌళికి…ఇటు రోబోతో శంకర్ కే దక్కుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమా పట్ల బాలీవుడ్ స్టార్ కి మరింత మక్కువ పెరిగేలా చేసింది వాళ్లే. ఆ రెండు సినిమాల ముందు వరకూ తెలుగు సినిమాపై, రకరకాల శెటైర్ లు వేసే వాళ్ళు హిందీ పరిశ్రమ వాళ్ళు…కానీ కధ పూర్తిగా మారిపోయింది, అమితాభ్ నుంచి విద్యా బాలన్ వరకూ, వివేక్ ఒబ్రాయ్ నుంచి నానా పటేకర్ వరకూ అందరూ ఇప్పుడు తెలుగు సినిమాలో భాగం అయ్యారు..
మెగాస్టార్ సైరాలో అమితాభ్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటే, ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రధాన పాత్రలో విద్యా బాలన్ కనిపించనింది. ఇక వినయ విధేయరామలో చెర్రీతో వివేక్ ఒబ్రాయ్ యుద్దం చేస్తుంటే, నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా ఇటు కవచంలోనూ, అటు ప్రభాస్ సాహో లోను అలరించనున్నాడు. మరో పక్క అక్షయ్, నానా పటేకర్ ఇప్పటికే రజని కాంత్ సినిమాల్లో మెరిశారు. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో నటించేందుకు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హిందీ నటులు అంటే మన స్థాయి పెరిగినట్లే కదా!..



