ఇంకా చాలా మంది ఉన్నారట కదా? చిన్న శ్రీను తర్వాత ఎవరు?

botsa-satyanarayana-family-chinna-sreenus-tdp-move

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) హటాత్తుగా వైసీపీకి, పదవులకు గుడ్ బై చెప్పేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపిలో చేరిపోయారు. అందుకు బొత్స కుటుంబం కానీ వైసీపీ గానీ షాక్ అయినట్లు కనబడలేదు. అయ్యుంటే, ఈపాటికి మూకుమ్మడిగా ఎదురుదాడి మొదలుపెట్టేసేదే.

కానీ ఇంతవరకు బొత్స సత్యనారాయణ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గానీ ఎవరూ కనీసం స్పందించలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వైసీపీలో నుంచి ఇలాంటి జంపింగ్స్ మొదలవుతాయని విజయసాయి రెడ్డి ముందే చెప్పడం వల్ల కావచ్చు.

ADVERTISEMENT

టీడీపిలో చేరిన తర్వాత చిన్న శ్రీను కూడా ‘ఇంకా చాలా మంది నేతలు క్యూలో ఉన్నారని’ చెప్తున్నారు. అంటే విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా ఇది చిన్న శ్రీనుతో ఆగేది కాదన్న మాట. ఇది జస్ట్ బిగినింగ్ అయితే తర్వాత ఎవరు? బొత్స సత్యనారాయణా?

కానీ బొత్స కుటుంబానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు కదా? మరి మారాల్సిన అవసరం ఏముంది? అంటే జగన్‌ పోకడలతో వచ్చే ఎన్నికలలో వైసీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదని భావించడం వల్లనే చిన్న శ్రీను జంప్ అవడం నిజమనుకుంటే, బొత్స కుటుంబం కూడా అదే కారణంతో జంప్ చేయవచ్చు.

ఒకవేళ బొత్స కుటుంబం జంప్ చేయాలనుకుంటే వారు టీడీపి లేదా జనసేనలోకి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలలో స్థానిక నేతలతో టికెట్స్, సీట్ల కోసం పట్లు పట్టాల్సివస్తుంది.

కనుక బొత్స కుటుంబం విజయదశమినాడు విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారేమో? ఇందుకు మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1.వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతుందనే అంచనా. 2. విజయసాయి రెడ్డితో బొత్సకు సత్సంబందాలు ఉండటం. 3. విజయసాయి రెడ్డి తన పార్టీలో తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, కాపులు, బీసీలకు పెద్దపీట వేస్తానని ప్రకటించడం.

రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం బొత్స ఆరాటపడ్డారో అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక విజయసాయి రెడ్డి పార్టీలో చేరితే ఆ కల నెరవేరుతుందేమో? ఆ హోదాలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యేందుకు అవకాశం లభిస్తే బొత్స కాదంటారా?

కనుక వైసీపీకి ఇప్పుడు కావాల్సింది ఫైర్ బ్రాండ్స్…వారి ఫైరింగ్ కాదు.. మంటలు ఆర్పి నష్ట నివారణ చేయగల ఫైర్ ఇంజన్లు. లేకుంటే వైసీపీలో ఇది కార్చిచ్చులా రాయలసీమ జిల్లాల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories