ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగులు వ్యతిరేకిస్తే కుదర్దు

Botsa-Satyanarayanaపాఠశాలల విలీనాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండటంపై రాష్ట్ర విద్యాశాఖ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ఎంతో దూరం ఆలోచించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం తీసుకొంటున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడం సరికాదు. అయినా పాఠశాలలు విలీనం చేయడం లేదు కొన్ని తరగతులను మాత్రమే విలీనం చేస్తున్నాము. వాటిలో కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు ఓ కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దానిని బట్టి అవసరమైన చర్యలు తీసుకొంటాము.

ADVERTISEMENT

ప్రభుత్వం ప్రజలందరి అభిప్రాయాలు కనుగొని పరిపాలన చేయలేదు. కనుక ప్రజలకు, ప్రభుత్వానికి మద్యన ఉండే ప్రజాప్రతినిధుల అభిప్రాయాల ప్రకారం నిర్ణయాలు తీసుకొంటుంది. వాటిని ఉద్యోగులు అందరూ యదాతదంగా శిరసావహించాలి. వాటిలో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మాతో మాట్లాడవచ్చు. అంతేకాని ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తామంటే కుదరదు.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా విద్యార్థుల మేలు కోరే తీసుకొంటుంది తప్ప వేరే కారణంతో కాదు. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నప్పుడు ఆదిలో ఇటువంటి సమస్యలు రావడం సహజమే. వాటన్నిటినీ అధిగమించి ముందుకు సాగితే సత్ఫలితలు వస్తాయి. రాత్రికి రాత్రి ఫలితాలు రావు.

అయినా ఈ విషయంలో విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు లేని ఇబ్బంది ఉపాధ్యాయులకు ఎందుకు? ఒకవేళ వారికి ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నేరుగా వచ్చి నాతో మాట్లాడితే నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories