క్రికెట్ అనే పదం వినగానే, దాదాపు అందరి మదిలో మొదట వెలిగేది కచ్చితంగా ఒక బ్యాటర్ ఏ అయ్యుంటారు. 100 లో 90 మందికి ఇదే జరుగుతుంటుంది. అయితే, ఇంత బ్యాటర్ల పక్షపాతులుగా ఉన్న ఈ క్రికెట్ అభిమానులలో, చాలా కొంత మంది బౌలర్లను ఆధరిస్తుంటారు. అలాంటి బౌలరులెందరోలోనో కొందరు వెలుగులోకొచ్చారు .
మలింగా, వాల్ష్, జహీర్, కపిల్, మార్షల్, వసీం, అక్తర్, లీ, గ్రాత్, స్టెయిన్ వంటివారు ఈ బౌలర్ల పతాకానికి నాంది వేయగా, నేడు స్టార్క్, సౌథీ, షమీ, అండెర్సన్ వంటి వారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఇంతటి గుమ్ముగూడిన జాబితా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు ‘బుమ్రా’.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
2016 లో ఆస్ట్రేలియా తో జరిగిన టి-20 లతో అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్యూ చేసిన ఈ కుర్రాడు, మెరుపులు చాల త్వరగానే మెరిపించాడు. 2017 నాటికే జట్టులో తన స్థానం ఖాయంగా మార్చుకోగలిగారు. అప్పటికే ర్యాంకింగ్స్ లో వన్ డే లో ‘5 ‘, టి-20 లో ‘2 ‘ స్థానంలో ఉన్నారు.
ఇక 2018 కల్లా వన్ డే లో మూడవ స్థానాన్ని, టి-20 ల లో ఏకంగా ‘మొదటి’ స్థానాన్ని అందుకున్నారు. 2019 ,20 లో వన్ డేల్లో రెండవ స్థానాన్ని, టి-20 ల్లో మొదటి స్థానాన్ని కొనసాగించారు. 2021 -22 లో గాయం కారణంగా చిన్న గ్యాప్ ఇచ్చినా, 2023 లో దద్దరిల్లే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆసీస్ ఆటగాడు హెడ్ ‘నా మనవడికి కూడా బుమ్రా గురించి చెప్తాను’ అని చేప్పే స్థాయికి ఎదిగాడు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
ఇక 2024 లో భారత్ గెలుచుకున్న టి-20 ప్రపంచకప్ లో బుమ్రా చాల కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ జట్టు ను 120 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోనివ్వకుండా, ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా ను 24 బంతుల్లో 26 పరుగులు చేయనివ్వకుండా తన అద్భుతమైన ఆటతీరు తో ఆ టోర్నీ లో ‘ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్’ ను అందుకున్నారు. ఎందరో దిగ్గజ బ్యాటర్ల పాలిట యముడిగా మారాడు బుమ్రా.
అయితే, 2024 లో బుమ్రా ఇంకా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. బీ.జీ.టీ లో మొదటి టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించి, చరిత్ర లోనే భారత్ కు ఆసీస్ పై అతి పెద్ద విజయాన్ని అందించిన కెప్టెన్ గా మారాడు. పిచ్ ఏదైనా, స్పిన్ అయినా,పేస్ అయినా, బ్యాటర్ ఎవరైనా, గ్రౌండ్ ఏదైనా, దేశం ఏదైనా, ప్రపంచం లో ఎక్కడైనా అదే ఆటను కనపరుస్తూ, టీం ఇండియాకు కొండంత అండగా, భారత క్రికెట్ అభిమానుల పాలిట వరం లా అయ్యారు బుమ్రా.