కీలకమైన క్షిపణి ప్రాజెక్టులో ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్టు

BrahMos Technical secrets leaked by ISI Agent was arrestedదేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషాంత్‌ అగర్వాల్‌ పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఏయే సమాచారాన్ని చేరవేశాడు.. ఎలా దీన్ని కొనసాగించాడు.. ఈ విషయం ఇంతవరకు బయటకు ఎందుకు రాలేదనే అంశాలపై లోతుగా విచారిస్తున్నారు.

ADVERTISEMENT

[m9ad]

బ్రహ్మోస్‌ కీలక క్షిపణి మొదట్లో రష్యా సహకారంతో అభివృద్ధి చేసినప్పటికీ.. గత కొంత కాలంగా భారత శాస్త్రవేత్తలే దీన్ని తయారు చేస్తున్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్నిమార్చడంతో పాటు దాంట్లో అనేక కొత్త వ్యవస్థల్ని తీసుకురావడంతో పాటు అధునాతన క్షిపణిగా తీర్చిద్దుతున్నారు.

రష్యాతో భాగస్వామ్యం తర్వాత క్షిపణిలో చేసిన కీలక మార్పులకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని నిషాంత్‌ ఐఎస్‌ఐ ద్వారా పాక్‌‌కు అందించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారంతో ఈ ఉదయం నుంచి సోదాలు జరిపిన పోలీసులు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ బ్రహ్మోస్‌ యూనిట్ లో ఉండగానే అరెస్టు చేసారు. .

ADVERTISEMENT
Latest Stories