బీఆర్ఎస్ బోర్లా… కేటీఆర్ మాటలే కారణమా?

BRS Defeat in Municipal Polls Sparks Leadership Debate

ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌ బోర్లా పడిందా? అంటే అవుననే ఫలితాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్‌ విజయానికి సిఎం రేవంత్ నాయకత్వం ఎలా కారణమో, బీఆర్ఎస్‌ ఓటమికి కేటీఆర్‌ నోటి దురుసు అంతే కారణం. సిఎంని హౌలేగాడు అంటే చప్పట్లు పడ్డాయి కానీ ఓట్లు పోయాయి!

ADVERTISEMENT

కాంగ్రెస్‌ నాయకులని రేవంత్ ముందుండి నడిపిస్తే, కేటీఆర్‌, హరీష్‌ సరిగ్గా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు.. అని కవిత విమర్శించినా కదల్లే!

ఈ ఎన్నికలకు ముందు ‘జాగృతి జనం బాట’లో కవిత చేసిన నష్టాన్ని అంచనా వేయడంలో కృష్ణార్జునులు విఫలమైయ్యారు!

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందనే వాదన కంటే హామీల కోసం నిలదీస్తే ఫలితం వేరేలా ఉండేదేమో?

మున్సిపల్ కోసమే ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నోటీసులు, విచారణ అని ఇద్దరూ కనిపెట్టారు. కానీ నష్ట నివారణ చేసుకోలేకపోయారు.

కర్ణుడి చావుకి వంద శాపాలు, కారణాలు. ఇదే అంతే!

ADVERTISEMENT
Latest Stories