brs-ktr

ఇంకెన్నాళ్లు ఈ ప్రాంతీయ వాద రాజకీయాలతో బిఆర్ఎస్ పార్టీ కాలం నెట్టుకొస్తోంది. పార్టీ పేరులో నుంచి తెలంగాణ వాదాన్ని తొలగించిన ఈ పెద్దమనుషులు ఇప్పుడు మాత్రం తెలంగాణ తల్లికి అవమానం జరిగింది. తెలంగాణ వాదానికి అన్యాయం చేస్తున్నారు.

Also Read – తెలంగాణలో కూడా సేమ్ సేమ్!

తెలంగాణ ఉనికిని చెరిపిస్తున్నారు అంటూ ముసలి కన్నీరు ‘కారు’స్తారు.? సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెడతారా.? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా.? ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా.? ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా.? అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తన X లో కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహన్ని తొలగించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం లేదు. అలాగే అటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మా ప్రభుత్వంలోనే ఆవిష్కరిస్తాము అంటూ హామీ ఇచ్చారు.

Also Read – పవన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు…!

తెలంగాణ వాదం మీద, తెలంగాణ తల్లి మీద అంత గౌరవం ఉన్న బిఆర్ఎస్ నాయకులు పదేళ్ల పాటు తమ చేతిలో అధికారం పెట్టుకుని కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించలేకపోయారు.? అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును జాతీయ రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు.?

ఇలా చేసి బిఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవ పరచలేదా.? దీనితో ఉద్యమ స్ఫూర్తి దెబ్బ తినలేదా.? తుచ్ఛమైన స్వార్ధ రాజకీయాల కోసం పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని తొలగించి తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ ఏమార్చలేదా.?

Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

అసలు బిఆర్ఎస్ పార్టీ నేతలకు తెలంగాణ తల్లి అనే పదం ఉచ్చరించడానికి అర్హత ఉందా.? అంటూ సోషల్ మీడియాలో మాజీ మంత్రి కేటీఆర్ పై అటు తెలంగాణ వాదులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.

చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయడం చేతకాకపోతే ప్రతిపక్షంలోకి వచ్చాకా ప్రశ్నించే అర్హత కోల్పోతారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో జరిగింది కూడా ఇదే. పదేళ్ల తన అధికారంలో పక్క రాష్ట్ర రాజకీయాల మీద పెట్టిన శ్రద్ద కాస్త ఇటువంటి వాటి మీద పెట్టుంటే ఇప్పుడు కేటీఆర్ కు కనీసం ప్రశ్నించే అవకాశం అయినా దక్కుండేది.