ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి ఇది కస్టడీలో ఉన్న కవిత కేసులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. కవిత కేసు విచారణ చేపడుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగపాల్ ఆ కేసు విచారణ నుండి బదిలీ అయ్యారు.
అయితే ఆయన స్థానాన్ని జస్టిస్ కావేరి భావేజా తో భర్తి చేసారు. అయితే అసలు కేసు విచారణ మొదలు పెట్టి వారం రోజులు కూడా గడవకముందే న్యాయమూర్తి బదిలీ కావడంతో అసలు కవిత కేసు ఏ మలుపు తిరుగుతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు.
ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14 న సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు కవిత. ఈ రిట్ పిటిషన్ మీద విచారణ అవసరం లేదంటూ పిటిషన్ ను వెనక్కుతీసుకోవడం…విచారణ చేస్తున్న న్యాయవాది బదిలీ కావడం తో ఇక ఈ కేసు ముగిసే సరికి ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి.
మార్పు మంచిదే అంటూ సంబరపడాలో…కంగారు పడాలో తెలియాలంటే బిఆర్ఎస్ పార్టీ పెద్దల భవిష్యత్తు కార్యాచరణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే కవిత కేసు విషయమై ఒక్కమాట మాట్లాడని కేసీఆర్ వైఖరి…న్యాయవాది మార్పు పై స్పందించని బిఆర్ఎస్ అధినాయకత్వం తీరు అన్ని అనుమానాస్పదంగా నే ఉన్నాయి. ఇంతకీ ఈ మార్పు బిఆర్ఎస్ లకు మంచి చేస్తుందా…బీజేపీ నాయకులకు మేలు చేస్తుందా అని తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.




