వైసీపీ – బిఆర్ఎస్ ఇద్దరిది ఒకటే స్క్రిప్టా…? ఇంతకీ దాని ఓనర్ ఎవరో..?

BRS Mla Palla Rajeswar Reddy

వైస్సార్ పార్టీ రాజకీయాలలోకి అడుగుపెట్టిన నాటి నుంచి రాజకీయాలలో కొన్ని కొత్త అనేకన్నా చెత్త సంప్రదాయాలను తీసుకువచ్చారనే చెప్పాలి. అందులో ముఖ్యంగా తమ ప్రత్యర్థి పార్టీల నేతలను బూతులు తిట్టడం, ఆ కుటుంబంలోని ఆడవారిని రాజకీయ విమర్శలకు వాడుకోవడం, వారి పై తన కాలకేయ సైన్యంతో సోషల్ మీడియాలో వికృతంగా దూషించడం.

అలాగే తమకు వ్యతిరేకంగా ఎవరు ఏ విమర్శ చేసినా దానికి బాబే కారణం అంటూ వాదించడం, జగన్ నిర్ణయాలను తప్పుబట్టిన ప్రతి వారిని బాబు స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటూ అవహేళన చేయడం…ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వ సలహాదారుల లిస్టంత ఉంటుంది వీరు సృష్టించిన సంప్రదాయాల పొద్దు.

ADVERTISEMENT

అయితే ఇందుకు జనసేన అధినేత పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ RRR ,అలాగే రాష్ట్రానికి అతిముఖ్యమైన వ్యక్తులు రాజధానికి భూములిచ్చిన రైతులు….వీరందరూ అతీతులు కారని వీరంతా కూడా బాబు మనుషులే, బాబు స్క్రిప్ట్ ఫాలో అయ్యి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నవారే అంటూ ముఖ్యమంత్రి జగన్ నుండి వైసీపీ కిందిస్థాయి నేత వరకు అందరూ ఒకటే స్క్రిప్ట్ ఫాలో అయిపోతున్నారు.

అయితే ఏపీ ప్రజలకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాటలు వినివిని అలవాటుగా మారిపోయాయి కూడా. అయితే ఇప్పుడు ఇదే వైసీపీ స్క్రిప్ట్ పక్క రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు ఫాలో అవ్వడంతో జగన్ – కేసీఆర్ రహస్య బంధం మరోసారి చర్చకు వచ్చింది. అసలే ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.

ఇక రేవంత్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు ఇక చేసేదేమి లేక తమకు అలవాటైన తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు ఏపీ ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండడంతో ఇక ఆటలోకి తొలి అడుగు వేశారు తెలంగాణ బిఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన రాజకీయ శిష్యుడైన రేవంత్ ను అడ్డుపెట్టుకుని బాబు తెలంగాణ ఆనవాళ్లను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఓరుగల్లు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కాకతీయుల రాజముద్రను తొలిగిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం బాబు స్క్రిప్టులో భాగమే అంటూ పల్లా రాజేశ్వర రావు వైసీపీ స్క్రిప్ట్ బాట పట్టారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏమార్పూ చేసినా దానికి కారణం పక్క రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్న బాబే అనడం ఇదెక్కడి విడ్డురమో..? ఎదో పాత కాలం సామెత మాదిరి ‘ఎవరో ఏడవలేక మంగళవారం’ అన్నట్టు ఉంది ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.

అంటే గడిచిన నాలుగున్నరేళ్లుగా జగన్ చేస్తున్న మార్పులన్నీ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్క్రిప్టులో భాగమా…పల్లా గారు..? ప్రజావేదిక కూల్చివేత మొదలు, రాజధాని మార్పు, బాబు అరెస్టు, ప్రతిపక్షాలు మీద తప్పుడు కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో జరిగిన విధ్వంసాలే. అయితే వీటన్నిటికీ కేసీఆర్ బాధ్యత వహిస్తారా..?

ఇదంతా కేసీఆర్ స్క్రిప్ట్ లో భాగంగానే జగన్ చేసినా మార్పులా..? పల్లా రాజేశ్వరావు కి తెలియని విషయం ఏంటంటే ఇలా బాబు పై ఒకవేలు చూపిస్తే కేసీఆర్ పై కొన్ని వందల వేళ్ళు చూపించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది. ఇంతకీ ఈ స్క్రిప్ట్ పేపర్ కళ్ళ ముందు లేకపోతె కనీసం తమ రాజకీయ విరోధులు మీద సైతం విమర్శ కూడా చేయలేని దయనీయ స్థితిలో ఓ పార్టీ అధినేత ఉండడం ఇక్కడి కొసమెరుపు. ఇంతకీ ఈ వైసీపీ – బిఆర్ ఎస్ ల స్క్రిప్ట్ పేపర్ ఓనర్ ఎవరో..? దాని పేటెంట్ రైట్స్ ఎవరివో తెలియాలంటే ఏపీలో కూడా మార్పు రావాల్సిందేనా..!

ADVERTISEMENT
Latest Stories