తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిత్యం కాంగ్రెస్, బిజేపిలపై కత్తులు దూస్తూనే ఉంటుంది. అయితే బిజేపిలో విలీనం అయ్యేందుకు ఎప్పుడో సిద్ధం అయ్యిందని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ పార్టీలో ఉన్నప్పుడే స్వయంగా బయటపెట్టారు. తనను తిహార్ జైలు నుంచి విడిపించుకునేందుకు బిజేపిలో విలీనానికి బీఆర్ఎస్ పార్టీ సిద్దపడిందని చెప్పారు.
ఆ తర్వాత నుంచి కేసీఆర్ ఫామ్‌హౌసుకు పరమితం అవడం, బిజేపి విషయంలో ఆచితూచి విమర్శిస్తుండటం వంటివి బిజేపితో బీఆర్ఎస్ పార్టీ చేతులు కలపబోతోందనే సంకేతాలుగా చూడాల్సి ఉంటుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అడగకుండానే అది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న ‘డీలిమిటేషన్ బిల్లు’కి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ప్రకటించారు.
దీనికి అయన వేరే ఏవో కారణాలు చెప్పుకొని ఉండవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో బిజేపితో పొత్తులకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని దీంతో సంకేతం పంపినట్లే భావించవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభలో ఎంపీలు లేరు కానీ రాజ్యసభలో ముగ్గురున్నారు.
ఇప్పటికే తమిళనాడులో ప్రధాన పత్రిపక్ష పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్ ఈ బిల్లుకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు బిజేపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలే చివరికి బీఆర్ఎస్ పార్టీని గమ్యం చేర్చవచ్చు.
ఒకవేళ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయనుకుంటే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మేల్కొవలసి ఉంటుంది. అలాగే ఏపీలో టీడీపి, జనసేనలు కూడా.
Our stand on Delimitation has always been clear:
No reduction in South India’s parliamentary representation. No injustice to Telangana will be tolerated
We have consistently demanded that the South’s existing 24% share in parliament be protected.
The proposed 50% increase in seats, with a safeguard against altering the inter-state representation ratio until 2051, addresses this key concern while increasing Telangana’s Lok Sabha seats from 17 to 26.
Keeping Telangana’s interests paramount, our three Rajya Sabha MPs will vote in favour of the proposal.
We have always supported women’s reservation and remain committed to its implementation.
— KTR (@KTRBRS) November 28, 2026





