రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రాజకీయాలు మాత్రం మూసపోసి తీసిన్నట్లు ఒకేలా సాగుతుండటం విశేషం. ఇది ఎన్నికల ఫలితాలతోనే మొదలై నేటికీ అచ్చు గుద్దిన్నట్లు ఓకేలాగ సాగుతుండటం విశేషం.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
ఇదీ ఒకందుకు మంచిదే. అక్కడ బిఆర్ఎస్, ఇక్కడ వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతోందో.. ఎలా జరుగుతోందో చూసుకుంటూ సింపుల్‌గా, సులువుగా రాజకీయాలు చేసుకోవచ్చు.
తెలంగాణలో కేసీఆర్ హయంలో అభివృద్ధి పేరుతో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శిస్తూ విచారణలు జరిపిస్తోంది. తెలంగాణలో ఒకవేళ అవినీతి జరిగినా అభివృద్ధి కనిపిస్తోంది కానీ ఏపీలో తిరుమల మొదలు కాకినాడ పోర్టు వరకు ఎక్కడ చూసినా అవినీతి, ఆక్రమాలే, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయని సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అక్కడా ఇక్కడా అవినీతి ఆరోపణలతోనే కేసులు నమోదవుతున్నాయి.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
కానీ కేసులలో చిక్కుకుంటే ఎవరూ భయపడిపోనక్కరలేదు. వీలైతే ముందస్తు బెయిల్ తీసుకొని అరెస్ట్ తప్పించుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయినా బెయిల్‌పై వెంటనే బయటకు వచ్చేయవచ్చు. బెయిల్ ఆలస్యమైతే జైల్లోనే యోగా అవీ చేసుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని కేటీఆర్ చెప్పారు.
కనుక రెండు రాష్ట్రాలలో నేతలు ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. హరీష్ రావుని ఫోన్ టాపింగ్ కేసులో బుక్ చేస్తే ముందస్తు బెయిల్ తీసుకోగా, రాంగోపాల్ వర్మ కూడా అలాగే తప్పించుకున్నారు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
వైసీపీ నేతలు కొందరు ఇలా లోపలకు వెళ్ళి అలా బయటకు వచ్చేశారు. ఫార్ములా తెలిసిపోయింది కనుక ఇప్పుడు అందరికీ ధైర్యం వచ్చేసింది.
ఆనాడు జగన్ సిఎం కాగానే ప్రజావేదిక కూల్చేసి, అమరావతిని పాడుబెట్టేసి, పొలవరాన్ని రివర్స్ చేసి, రాష్ట్రానికి వైసీపీ రంగు పూశారు.
ఇప్పుడు తెలంగాణలో హైడ్రాతో కూల్చివేతలు సాగుతున్నాయి. కాళేశ్వరాన్ని పాడుబెట్టేశారు. టిఎస్ టీజీగా మారింది. చివరికి తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చేస్తున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నా అందరూ గట్టిగానే పోరాడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చచేసి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ అక్కడకు చేరుకొని అక్కడే కూర్చొని ధర్నా చేసి బిఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్‌గా ఉందనే బలమైన సంకేతాలు ప్రజలకు, ప్రభుత్వానికి పంపగలిగారు.
కానీ ఈ ఒక్క విషయంలో జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటరిగా మిగిలిపోయిన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పిలిస్తేనే వైసీపీ నేతలు ప్యాలస్ మీటింగులకి వచ్చిపోతున్నారు తప్ప బిఆర్ఎస్ పార్టీ నేతల్లాగ ఎవరూ దూకుడుగా వ్యవహరించడం లేదు. కనుక వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. ఇది గమనించిన జగన్ డిసెంబర్ ధర్నాలా షెడ్యూల్ వారి చేతిలో పెట్టి వెళ్ళి పోరాడమన్నారు.
ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకు వెళ్ళేందుకు వైసీపీ నేతలు ఇష్టపడలేదు. కనుక ఇప్పుడు పోరాటాలకి ఎందరు హాజరవుతారో చూడాల్సిందే.
అక్కడ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో, ఇక్కడ తాడేపల్లి ప్యాలస్‌లో గృహ నిర్బంధం విధించుకొని జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాతే బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు అచ్చు గుద్దిన్నట్లు ఒకేలా సాగుతుండటం చాలా గమ్మత్తుగానే ఉంది కదా?