1.08 లక్ష కోట్ల పెట్టుబడి… బుల్లెట్ ట్రైన్ ముహూర్తం..!

 bullet train project to start on September 14ఇండియన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, గత బడ్జెట్ లో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అంత పేదరికం ఉంటే, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ అవసరమా అంటూ ప్రతిపక్షాలు నిందిస్తున్నా… ఖాతరు చేయని మోడీ, తాజాగా దానిని అమలు చేసి చూపించబోతున్నారు. దేశానికే తలమానికంగా భావించిన ఈ ప్రాజెక్ట్ కు ఈ నెల 14వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేసారు.

ADVERTISEMENT

జపాన్ ప్రధాని షింజో అబె చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న ఈ బుల్లెట్ ట్రైన్, ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సాగనుంది. ఈ దిశగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. షుమారు ఒక లక్షా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో… ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని, మహారాష్ట్ర, గుజరాత్ లో హైస్పీడ్ ట్రాక్, 21 కిలోమీటర్ల టన్నెల్స్ కూడా ఉంటాయని సదరు గుజరాత్ ప్రభుత్వ ప్రకటనలో స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Latest Stories