చేనేతలకు 2019లో టీడీపీ అన్యాయం చేస్తే వైకాపా 2014లోనే చేసినట్టు కదా?

TDP using Butta Renuka on YSRCPమంగళగిరిలో చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ను ఓడించడానికి జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకను ప్రయోగించారు. రేణుక చేనేత వర్గానికి చెందిన వారు కావడంతో మంగళగిరిలో ఆ వర్గం ఎక్కువగా ఉండటంతో వారిని టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని చేనేత వృత్తిదారులను నమ్మించి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని రేణుక ధ్వజమెత్తారు. న్యాయంగా వారికి రావాల్సిన సీటును కొడుక్కి కేటాయించారు.

తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చేనేత మహిళలను మభ్యపెట్టి మోసం చేసి అవమానించిన చంద్రబాబుకు రాష్ట్రంలోని నేతన్నలంతా తమ సత్తా ఏంటో చూపించాలని కోరారు. ఇదంతా బానే ఉంది. చేనేత వర్గాలకి ఇవ్వాల్సిన సీటు లోకేష్ కు ఇచ్చారు సరే మరి ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏం చేసింది? 2014లో గానీ ఇప్పుడు గానీ మంగళగిరి సీటును చేనేత వర్గానికి ఇవ్వలేదు కదా? ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేనేత వర్గానికి చెందిన వారు కాదు కదా?

ADVERTISEMENT

ఒకవేళ 2019లో చేనేత వర్గాలకు తెలుగుదేశం పార్టీ ద్రోహం చేస్తే ఆ వర్గాలకు 2014 నుండే వైఎస్సార్ కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నట్టు కదా? పోనీ సీటు ఆశించి మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన బుట్టా రేణుకకు జగన్ ఏం న్యాయం చేసినట్టు? నారా లోకేష్ తన జీవితంలోని మొట్టమొదటి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. 1985 తరువాత తెలుగుదేశం పార్టీ ఒక్క సారి కూడా గెలవని మంగళగిరిని ఆయన ఎంచుకోవడం విశేషం. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ADVERTISEMENT
Latest Stories