కెరియర్ ఆరంభంలో మాస్ ఆడియన్స్ ను అలరించడానికి ఆ తరహా సినిమాలు ఎక్కువగా చేసిన చరణ్, ఈ మధ్య కాలంలో మాస్ ఇమేజ్ కి కాస్త దూరంగా వెళుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ కావడానికే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడు. మాస్ ఇమేజ్ ఒక హీరోను ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలిసిన చిరంజీవి, చరణ్ వేస్తోన్న అడుగుల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారట.
‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి కుటుంబ కథా చిత్రాలు… ‘ధ్రువ’ తరహా స్టైలీష్ మూవీస్ చేయడం మంచిదే కానీ, మాస్ ఇమేజ్ నుంచి బయటకి రావడానికి ప్రయత్నించవద్దని చరణ్ కి చెప్పారట. అలాగే ‘రంగస్థలం’ తరువాత ఆయన తప్పకుండా ఒక మాస్ సినిమా చేయవలసిన అవసరం ఉందని చెప్పడంతో, బోయపాటితో సినిమా చేయడానికి చరణ్ అంగీకరించాడని ట్రేడ్ వర్గాల టాక్.
ADVERTISEMENT
ADVERTISEMENT


