ఆ నిర్మాత తిట్టిన తిట్లు వింటే నిద్ర కూడా పట్టదు..!

C Kalyan, C Kalyan Natti Kumar, C Kalyan Natti Kumar Controversy, Producer C Kalyan Natti Kumar Controversy, C Kalyan Producer Natti Kumar Controversyటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ గారు నట్టికుమార్ తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఖండించడమంటే ఆషామాషీ ఖండన కాదు తిట్లతోనే చీల్చి చెండాడారు. ఎంతలా అంటే ఆయన తిట్టిన తిట్లు వింటే ఎవరికైనా సరే నిద్ర కూడా పట్టదు.

తెలంగాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ నాయీమ్ ఎంకౌంటర్ జరిగిన దగ్గర్నుంచి పరిశ్రమకు చెందిన డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సి. కళ్యాణ్ కు, నయీమ్ కు సంబంధాలున్నాయని, కళ్యాణ్ తనకు ప్రాబ్లమ్ వస్తే నయీమ్ తో చెప్పి సాల్వ్ చేయించుకునేవాడని, కావాలంటే తన దగ్గర ఆధారాలున్నాయని పెద్ద రచ్చ చేశాడు.

ADVERTISEMENT

ఇదే అంశమై కళ్యాణ్ ను మీడియా వివరణ అడగ్గా నట్టి కుమార్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని అతనొక లోఫర్ అని, వైజాగ్ లో థియేటర్లకు రెంట్లు కట్టకపోతే అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేశారని అన్నారు. అలాగే నయీమ్ పేరుతో నట్టి కుమార్ బెదిరింపులకు పాల్పడేవాడని కూడా అన్నారు. అంతేగాక తనకు నయీమ్ కు ఎటువంటి సంబంధం లేదని, ఆధారాలుంటే భయటపెట్టమని ఘాటైన సమాధానం ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories