ఓటమి పరాభవానికి రో-కో లు బదులు చెపుతారా.?

Rohit Sharma Virat Kohli Comeback

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నడుస్తున్న మధ్యలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పి వారి రిటైర్మెంట్ ను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అప్పటికే టీ-20 ల కు గుడ్-బాయ్ చెప్పేయటంతో అభిమానులు నిరాశ చెందారు.

జూన్ మొదటి వారంలో ముగిసిన ఐపీఎల్ తరువాత మళ్ళీ తాము ఆరాధించే ఆటగాడిని చూసేందుకు సుమారు 150 రోజులు వేచి చూడక తప్పలేదు. అయితే రో-కో ల కం-బ్యాక్ సిరీస్ లో రోహిత్ మరియు కోహ్లీ నిరాశ పరిచే విధంగానే ప్రారంభించినప్పటికీ, రోహిత్ ఫామ్ అందుకుని చెలరేగాడు.

ADVERTISEMENT

ఒక 70 మరియు సెంచరీ తో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు రోహిత్. అయితే విరాట్ తన అభిమానులకు సంతోషాన్ని అంత సులువుగా ఏమి ఇవ్వలేదు, 2 మ్యాచ్లు ఊరించి, మూడవ మ్యాచ్ లో తన క్లాస్సీ బ్యాట్టింగ్ తో వింటేజ్ విరాట్ ను స్మరణకు తెచ్చాడు.

సిరీస్ కోల్పోయినప్పటికీ, రో-కో లు చక్కగా ప్రదర్శించటంతో అభిమానులు సైతం సిరీస్ ఓటమిని అంతగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. భారత్ కు వచ్చి, మనను వైట్-వాష్ చేసి 2-0 తో టెస్ట్ సిరీస్ ను నెగ్గిన ఆఫ్రికా పై భారత్ ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ నెల 30 న రాంచీలో జరగబోతున్న వన్ డే సిరీస్ లో భారత్ జట్టు సౌత్ ఆఫ్రికా పై ఘన విజయం సాధించి తమకు టెస్ట్ లో జరిగిన ఘోర పరాభవానికి, ఓటమి భారానికి బదులు తీర్చుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు విరాట్ – రోహిత్ ఒక ఆయుధంగా మారాలంటూ ఆకాంక్షిస్తున్నారు రో- కో అభిమానులు.

అలాగే దానికి తోడు సౌత్ ఆఫ్రికా కోచ్ షుక్రి కొన్రాడ్ సిరీస్ చివరి రోజు ఆటకు ముందు చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వేళ, వారికి ఎవరైనా సరైన సమాధానం ఇవ్వగలిగిన వారున్నారంటే అది కేవలం కింగ్ కోహ్లీ నే అని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయిపోయారు.

చివరి రోజు ఆట ప్రారంభానికి మునుపు ఆఫ్రికా కోచ్ ‘మేం భారత్ ను ఇంకా అణచివేయాలని అనుకున్నాం, అందుకే తొలి ఇన్నింగ్స్ భారీ లీడ్ ఉన్నప్పటికీ, రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చాం’ అని చెప్పారు. అయితే, ఈ కామెంట్స్ కు కింగ్ మరియు హిట్-మ్యాన్ వారి శైలిలో సమాధానం చెబుతారని ఆశిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.

ADVERTISEMENT
Latest Stories