అనసూయ “రికార్డింగ్” ఉదంతం – ఫుల్ డీటెయిల్స్!

Case filed on Anasuya Bharadwaj ‘జబర్దస్త్’ కార్యక్రమంతో హాట్ సెలబ్రిటీగా మారిన అనసూయ, ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలలో కూడా నటిస్తోంది. ఆ రేంజ్ సెలబ్రిటీగా మారడంతో, ఈ ముద్దుగుమ్మతో ఒక్క ఫోటో అయినా కావాలంటూ సామాన్యులు ఉత్సాహం చూపడం సహజమే. ఆ క్రమంలోనే తాజాగా ఓ చిరు బాలుడు అనసూయతో సెల్ఫీ చూపడానికి ఉత్సాహం చూపగా, దానికి విముఖత అనసూయ విముఖత చూపింది.

అయితే సీన్ అక్కడితో ఆగితే బాగానే ఉండేది. తల్లితో ఉన్న ఆ బాలుడు, కారులో ఉన్న అనసూయను రికార్డ్ చేయబోతుంటే, ఆగ్రహించిన అనసూయ, ఆ ఫోన్ ను నేలకేసి కొట్టి, వారిద్దరిని దుర్భాషలాడుతూ వెళ్ళిపోయిందనేది… ఆ బాలుడి తల్లి ఆవేదన. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఉదంతంపై అనసూయ జాతీయ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది.

ADVERTISEMENT

తార్నాకలో తన తల్లి ఇంటికి వెళ్తుంటే, ఫోన్ లో రికార్డ్ చేస్తూ తన వద్ద సెల్ఫీ కోసం వస్తుంటే వద్దని చెప్పానని, కానీ వారు వినకుండా మరింత దగ్గరికి వస్తుంటే, తన ఫేస్ కప్పుకుని కారు ఎక్కి వెళ్ళిపోయానని, వారి ఫోన్ పగలగొట్టినట్లుగా నాకైతే గుర్తు లేదని చెప్పుకొచ్చింది. సాధారణంగా తాను ఎక్కువ సెల్ఫీ ఫోటోలు ఎవరితో అయినా దిగుతానని తన స్నేహితులు కోప్పడుతుంటారని, కానీ ఆ సమయంలో తాను ఆ మూడ్ లో లేనని తెలిపింది.

దీనికి సంబంధించి సదరు మహిళ అనసూయపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనసూయను పెద్దగా ఇబ్బంది పెట్టే కేసు కాకపోయినా, సెలబ్రిటీలపై కేసు అంటే సాధారణ వార్త కాదు కదా! దీనికి సంబంధించి ట్విట్టర్ లో కూడా తన భావాన్ని పంచుకుంది. ఫోన్ పగిలినందుకు సారీ చెప్తూ… దానికి తనను నిందించవద్దని, తమకు ప్రైవసీ ఉంటుందని పేర్కొంది.

ADVERTISEMENT
Latest Stories