పోలవరం ప్రాజెక్ట్కు కేంద్రం సరికొత్త అడ్డుపుల్ల!

Central Government no to more funds for Polavaram Projectపోలవరం ప్రాజెక్ట్కు చెందిన కాంట్రాక్టర్ ట్రాన్స్టాయ్ కంపనీ పనులను ఏమాత్రం ముందుకు నడపలేకపోతుంది. వేరు వేరు సబ్- కాంట్రాక్టర్లను తెచ్చి పనులు చేయించాలనే ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. ఇంకా చేసేది లేక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది.

ADVERTISEMENT

అవసరమైతే కాంట్రాక్టర్ను మార్చాలని ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఐతే రాయపాటి సాంబశివరావు తన పలుకుబడితో డిల్లీలో పని పూర్తి చేశారు. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని మార్చేది లేదని కుండబద్దలు కొట్టారు. ట్రాన్స్టాయ్ కంపనీతోనే పోలవరాన్ని 2019లోగా పూర్తి చేస్తామని చెప్పారు.

కాంట్రాక్టర్‌ను మార్చితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని, దానిని భరించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన తెలిపారు. ఐతే ఇది కేంద్రం సరికొత్త వ్యూహంగా కనిపిస్తుంది. వివిధ ప్రాజెక్ట్‌లకు అసమర్ధ కాంట్రాక్టర్లకు ఇప్పించి వారు పనులు చెయ్యాట్లేదు అనే కారణంతో నిధులు విడుదల చెయ్యరు.

విజయవాడలో నిర్మిస్తున్న కనక దుర్గ వారధి పరిస్తితి కూడా ఇదే. తద్వారా కేంద్రం చేతికి మట్టి అంటకుండా కాగల కార్యం పూర్తి అవుతుంది. ఫేల్యూర్ మాత్రం చంద్రబాబు అకౌంట్లో పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రాణధార వంటి పోలవరం ప్రాజెక్ట్ తో ఇటువంటి రాజకీయ క్రీడ ఆడటం అత్యంత ప్రమాదకరం.

ఐతే గెలుపుఓటములే నేటి భాజపా రాజకీయ పరమావధి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంకింద పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించబడింది. దీని పూర్తి వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. తాజా అంచనాల మేరకు ఈ ప్రాజెక్ట్ వ్యయం 45000 కోట్ల పై మాటే.

ADVERTISEMENT
Latest Stories