2019 ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ ముఖచిత్రానికి – జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పడిన పొలిటికల్ ప్రతిబింబానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

సీఎం అయిన తర్వాత జగన్ చేసిన కక్షపూరితమైన రాజకీయాలు టీడీపీ మరియు జనసేన వర్గీయులలో తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. దాదాపుగా అయిదేళ్ల పాటు జగన్ చెప్పుచేతల్లో ప్రతిపక్షాలు ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read – మారాల్సింది ఎవరు? చంద్రబాబా… జగనా?

ఎదురుతిరిగి మాట్లాడితే ప్రత్యక్ష దాడులకు దిగడం వైసీపీ నైజంగా మారిపోయిన దరిమిలా పార్టీ నేతలతో పాటు ఏకంగా పార్టీ కార్యాలయాలపై కూడా వైసీపీ వర్గాలు బరితెగించి దాడులు చేసిన వైనాన్ని ఏపీ రాజకీయాలు ఎప్పటికీ మరిచిపోకుండా చేసాయి.

అయిదేళ్లుగా ఇన్ని దాడులు జరిగినా, ఏ ఒక్క పోలీస్ కేసు గానీ, నిందితులపై ఏ ఒక్క చర్య గానీ తీసుకోకపోవడం అనేది రాష్ట్రాన్ని జగన్ ఏ విధంగా నడిపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Also Read – టీజర్‌కే ఆందోళన చెందితే ఇక సినిమా ఎలా చూస్తారు?

అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండవు. సాధారణ ఎన్నికలు వచ్చాయి, ప్రజానీకం అంతా ఓటు వేశారు, జూన్ 4వ తేదీన బ్యాలెట్ బాక్స్ లు బద్దలు కాబోతున్నాయి.

ప్రీ పోల్ సర్వేల ప్రకారం గానీ, పెరిగిన ఓటింగ్ శాతం ప్రకారం గానీ టీడీపీ – జనసేన – బీజేపీల విజయం తధ్యం అనేది రాజకీయ వర్గాలు మరియు మీడియా వర్గాలలో దాదాపుగా ఖరారైన విషయం.

Also Read – న్యూటన్స్ లా: అర్థమైందా రాజా..!

దీంతో వైసీపీ అండ్ కో పూర్తిగా డీలా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన పిదప, తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని, ఇప్పటినుండే ఓ రకంగా ప్లేట్లు ఫిరాయించే వ్యాఖ్యలు చేస్తున్నారు.

బహుశా ఒకప్పటి చంద్రబాబు అయితే క్షమించి తన పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టేవారు. మరి ఈ అయిదేళ్ల అరాచకం అనుభవించిన తర్వాత కూడా చంద్రబాబు అంతే శాంతమూర్తిగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారిన అంశం.

“ఇప్పటివరకు తనని ఒక విధంగా చూసారు, కానీ కఠినమైన చంద్రబాబు ఎలా ఉంటాడు అనేది మీరు చూస్తారు” అని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు టీడీపీ అధినేత.

జరిగిందేదో జరిగిపోయిందని చంద్రబాబు శాంతంగా ఉన్నా, పార్టీ క్యాడర్ గానీ, పార్టీ నేతలు గానీ వైసీపీని గానీ, వైసీపీ నేతలను గానీ మన్నించే విధంగా ఉంటారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా మానవు.

ఇది ఒక్క టీడీపీ వర్గానికే పరిమితం అనుకుంటే పొరపాటే. గత అయిదేళ్లుగా జనసైనికులను కూడా జగన్ అండ్ కో ఇదే విధంగా నరకయాతన పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భాగస్వామిగా ఉండబోతున్న జనసేన కూడా జగన్ ను క్షమించే పరిస్థితిలో ఉందా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ రౌడీ రాజకీయాలను కూకటివ్రేళ్ళతో సహా అరికడతాను అంటూ భారీ భారీ డైలాగ్ లతో ఉద్వేగంగా స్పందించిన సందర్భాలు కోకొల్లలు.

దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, దాని నుండి తప్పించుకోవడానికి జగన్ వర్గపు మీడియాలే డిఫెన్స్ లో పడి, ప్రస్తుతం వైసీపీ పైనే తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇంత చేసినా, వీరిని క్షమించి వదిలిపెట్టే పరిస్థితిలో టీడీపీ అండ్ జనసేన వర్గీయులు ఉంటారా? అనేది భవిష్యత్తు తేల్చనుంది.