deeptech-chandrababu-naidu

రాజకీయ నాయకులు ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే అధికారంలోకి రాగలరు. ముఖ్యమంత్రి, మంత్రులు కాగలరు కూడా. కానీ అంత మాత్రాన్న అందరిరూ తెలివైనవారని, రాష్ట్రానికి సంబందించిన అంశాలపై అవగాహన ఉంటుందని, ముఖ్యంగా నిబద్దత ఉంటుందని అనుకోలేము.

గత వైసీపీ ప్రభుత్వంలో సిఎం జగన్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిదంగా వ్యవహరించేవారో గుర్తుచేసుకుంటే ఇది నిజమే అని అర్దమవుతుంది. విషయ పరిజ్ఞానం, నిబద్దత, దూరదృష్టి లేని పాలకుల చేతిలో పడితే రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా మారుతుందో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే అర్దమవుతుంది.

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

జగన్‌, మంత్రులు అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, టీడీపీ నేతలను అవహేళన చేస్తూ, వారిని వేదిస్తూ కాలక్షేపం చేశారు తప్ప ఏనాడూ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడింది లేదు కనీసం ఆలోచించలేదు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రాభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలతో ఓటు బ్యాంక్ నిర్మించుకోవడానికి, ఋషికొండ ప్యాలస్‌ నిర్మించుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రం కోసం పాటు పడతారా?

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

కానీ పాలకులకు ఈ మూడు గొప్ప లక్షణాలు ఉంటే ఏవిదంగా ఉంటుందో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని చూస్తే అర్దమవుతుంది.

శుక్రవారం విశాఖలో జరిగిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో డీప్ టెక్ రంగం, దానిలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర రంగాలలో ఏవిదంగా ఉపయోగించుకోవచ్చో అడిగి తెలుసుకున్నారు.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

‘డీప్ టెక్’పై అవగాహన కలిగిన తర్వాతే ఆయన ఆ సదస్సులో మాట్లాడారు. ఇప్పటికే బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, ఇప్పుడు ఈ ‘డీప్ టెక్’ గురించి కూడా ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని అన్నారు.

ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి ఏవిదంగా ఉపయోగించుకోవాలో ఆలోచనలు చేద్దామని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

యువకుడిని అని చెప్పుకునే జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో ఎప్పుడు మీడియా, ప్రజల ముందుకు వచ్చినా బటన్ నొక్కాను.. సంక్షేమ పధకాలతో మేలు చేస్తున్నానని చెప్పుకునేవారు. లేదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేయడానికే సరిపోయేది తప్ప ఏనాడూ ఆయన నోట ఇటువంటి మాటలు వినిపించనే లేదు.

జగన్‌ కంటే చంద్రబాబు నాయుడు వయసులో చాలా పెద్ద. కానీ ఈ వయసులో కూడా ‘డీప్ టెక్’ వంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ, దానిని రాష్ట్రానికి ఏవిదంగా వినియోగించవచ్చో ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా!