ఇటు అమరావతి…అటు విశాఖ…!

Chandrababu Naidu Announces Google To Visakhapatnam

మే 2 న దేశ ప్రధాని అనరెంద్ర మోడీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం కానున్న తరుణంలో అటు విశాఖ వాసులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్తను అందించారు.

అమరావతిలోని విట్ యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయిన సీఎం బాబు నూతన స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘వి లాంచ్ ప్యాడ్ 2025’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు త్వరలోనే విశాఖకు గూగుల్ వస్తుంది అంటూ ప్రకటించారు.

ADVERTISEMENT

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబు 2020 విజన్ తో ఆనాటి హైటెక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టి తన విజనరీ ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటి తరానికి కూడా సాక్ష్యంగా నిలిపారు. అలాగే 2047 విజన్ తో నేడు అమరావతిలో పనులు పునః ప్రారభించబోతున్నారు.

అయితే అభివృద్ధి తాలూకా ఫలాలు పొందడానికి కొన్నేళ్ల సమయం పట్టినప్పటికీ వారి తాలూకా ప్రయోజనాలను మాత్రం కొన్ని తరాలు అనుభవిస్తారు అని చెప్పటానికి నాటి హైద్రాబాద్ లో పడిన అభివృద్ధి పునాదులే నిదర్శనంగా చెప్పొచ్చు. అలాగే నేడు అమరావతిలో మొదలుకాబోతున్న అభివృద్ధి కూడా సజావుగా సాగితే ఏపీలో మరికొన్ని తరాల వరకు విద్యా అవకాశాలకు, నిరుద్యోగానికి తావుండకుండా ఉంటుంది.

ఇటు అమరావతితో అభివృద్ధి తో పాటుగా అటు విశాఖ పారిశ్రామిక ప్రగతికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు ఇప్పటికే విశాఖ కేంద్రంగా TCS సంస్థకు పెట్టుబడులు పెట్టేందుకు భూముల కేటాయింపులు జరిపారు. ఇక ఇప్పుడు త్వరలో గూగుల్ కూడా విశాఖ కేంద్రంగా ఏపీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధం కాబోతుంది అన్న ప్రకటన ఏపీ విద్యార్థులలో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది.

ఎంతో కస్టపడి చదువుకుని మంచి ర్యాంకులు సాధించినప్పటికీ సొంత రాష్ట్రంలో ఉద్యోగ
అవకాశాలు లేక ఎన్నో తరాల నుంచి ఏపీ యువత పొట్ట చేత పట్టుకుని కన్న వారికి, సొంత ఊరికి దూరంగా జీవనోపాధి పొందుతున్నారు. అలా కాకుండా ఏపీలో కూడా హైద్రాబాద్ మాదిరి అభివృద్ధి జరిగితే ఏపీకి జరిగిన విభజన గాయం కొంతైన మానే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories