కర్నూల్ జిల్లాలో బలోపేతం అవడంపై దృష్టి సారించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవలే నంద్యాలలో టీడీపీ భారీ విజయంతో మంచి కిక్కు మీద ఉన్న సైకెల్ పార్టీ జిల్లాలో బలోపేతం అవ్వడం పై దృష్టి సారించింది. అదే క్రమంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నంద్యాల నుండి పోటీ చెయ్యాలని భావిస్తునట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని పార్టీలోకి లాగే ప్రయత్నంలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. అందులో భాగంగా మొదట ఆయన వర్గం మీద కన్నేశరు. ఆదివారం రోజున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు టీడీపీలో కండువా కప్పుకున్నారు. ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంటలో ఐదు వందల మందితో కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంతరెడ్డి టీడీపీలో చేరారు.
అనుచరులను లాగి కోట్లను ఉక్కిరిబిక్కిరి చెయ్యడం చంద్రబాబు వ్యూహం. ఆ రకంగా అనుచరులు అందరినీ పోగొట్టుకున్నాక కోట్లకు టీడీపీ తప్ప వేరే ఆప్షన్ ఉండదని చంద్రబాబు ప్లాన్. కోట్ల టీడీపీ లో జాయిన్ ఐతే పసుపు పార్టీకి జిల్లాలో ఇంక అత్యధిక సీట్లు గెల్చుకోవడం లాంఛనమే. గత ఎన్నికల్లో కర్నూల్ సహా అన్ని రాయలసీమ జిల్లాలలో అత్యధిక సీట్లు గెల్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. తెదేపా గత కొన్ని ఎన్నికల్లో రాయలసీమలో ఆ పార్టీ తన ప్రభావం చూపించలేకపోతుంది. ఐతే ఈ సారి ఎలా ఐన ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఆ పార్టీని దెబ్బకొడితే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ కోల్కోవడం కష్టమే!


