తెలుగు రాష్ట్రాల గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్ నిన్న ఉన్నఫళంగా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు.. అదీ ఎన్‌డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక తొలిసారి వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగడం గమనార్హం.
[m9ad]
ఆగష్టు 15న కూడా చంద్రబాబు గవర్నర్ ఇచ్చిన అల్పాహారవిందుకు హాజరు కాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరా. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం చర్చకు రాలేదని చంద్రబాబు మీడియాకు చెప్పుకొచ్చారు. అయితే గవర్నర్ మోడీ నుండి చంద్రబాబుకు ఏమన్నా వర్తమానం మోసుకొచ్చారా? అనే అనుమానాలు ఉన్నవి.
అది ఏమయ్యుంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, మైనారిటీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో… ఆ విషయమూ గవర్నరుతో జరిగిన సమావేశంలో కచ్చితంగా చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






