ఇన్నాళ్ళకు చంద్రబాబు దొరికారు… అయితే వైసీపీ బుక్ చేసేస్తుందా?

Chandrababu-Naidu-Kandukuru-Stampede-Case-Nellore-ASPకందుకూరు విషాద ఘటన గురించి ఏపీ మంత్రులు, వైసీపీ నేతల మాటలు వింటుంటే, 8 మంది ప్రాణాలు కోల్పోయారనే బాధకంటే ఇన్నాళ్ళకు చంద్రబాబు నాయుడు తమకి అడ్డంగా దొరికిపోయారనే సంతోషమే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఘటన గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఎవరూ చనిపోయినవారి గురించి, వారి కుటుంబాల గురించి మాట్లాడటం లేదు. కానీ దీనికి కారకుడు చంద్రబాబు నాయుడే. ఆయనపై పోలీసులు కేసు నమోదుచేయాలని చెపుతున్నారు.

అంటే పోలీసులు ఎవరి మీద కేసు నమోదు చేయాలో మంత్రులు ముందే చెపుతున్నారన్న మాట! కనుక పోలీసులు అదేవిదంగానే నడుచుకోక తప్పదు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఈ కేసు గురించి చెప్పింది వింటే, మంత్రులు ఇస్తున్న ఈ సూచనలను వారు అమలుచేయడానికి సిద్దం అవుతున్నట్లు అర్దం అవుతుంది.

ADVERTISEMENT

నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ, “కందుకూరు పట్టణంలో మేము అనుమతించిన దాని కంటే 46 మీటర్లు చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చేశారు. మేము అనుమతించిన చోటే చంద్రబాబు నాయుడు సభ నిర్వహించుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ సర్కిల్ నుంచి ఎదురుగా ఉన్న ఇరుకు రోడ్డులోకి ప్రవేశించాలని ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాము.

ఈ ఘటనలో గాయపడిన పిచ్చయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. డీఎస్పీ ర్యాంక్ అధికారిని విచారణాధికారిగా నియమిస్తాము. ఘటనకి సంబందించి అన్ని సాంకేతిక, డిజిటల్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని ఛార్జ్ షీట్‌ ఫైల్ చేస్తాము,” అని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories