కుప్పంకి కృష్ణమ్మ… నారా లోకేష్‌ మాట నిలబెట్టుకున్నారు!

Chandrababu Naidu's Krishna Project and YSRCP's Silence

సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో కృష్ణమ్మకి గంగపూజ చేశారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో… దేనికో కూడా తెలియని మాజీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ఇదివరకు ప్రెస్‌మీట్‌ పెట్టి కుప్పంకు కృష్ణా జలాలా తీసుకువెళతావా బాబూ?అంటూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు మాట్లాడటం లేదు!

నిన్న డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు, జనసేన నేతలు రుషికొండ ప్యాలస్‌లో కలియతిరిగి మీడియాతో మాట్లాడితే వెంటనే మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్‌మీట్‌ పెట్టి ఏదేదో మాట్లాడారు. కానీ నేడు చంద్రబాబు నాయుడు కుప్పంకి కృష్ణా జలాలు తీసుకువచ్చి గంగపూజ చేస్తే వైసీపీలో ఒక్కరు మాట్లాడలేదు!

ADVERTISEMENT

వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ విషయం ప్రస్తావించకుండా రాష్ట్రంలో ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయాయి… రోడ్లు గుంతలు పడ్డాయంటూ డైవర్షన్ తీసుకుంది!

ఎందుకంటే, హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించిన సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెడుగా మాట్లాడితే అంతా తమకే ప్రజావ్యతిరేకత పెరుగుతుందని అర్దమైనట్లే ఉంది.

ఈ విషయంలో వైసీపీ ‘సైలంట్ మోడ్’లోకి వెళ్ళిపోగా సీమ జిల్లాల టీడీపి నేతలు, కార్యకర్తలు, ప్రజలు నాడు అంటే 2023, మార్చి 30న నారా లోకేష్‌ యువగళం పాదయాత్రని ఇప్పుడు గుర్తుచేసుకున్తున్నారు. ఆనాడు రాయలసీమ జిల్లాలకు హంద్రీ నీవాతో నీళ్ళు అందిస్తామని నారా లోకేష్‌ చెప్పిన విషయాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో (55వ రోజు) గుట్టూరు గ్రామంలో నారా లోకేష్‌ ఓ శిలాఫలకం ఆవిష్కరించారు.

గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు అందించి ఆ సమస్యలను శాస్వితంగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు. గ్రామస్తులు ఇప్పుడు ఆ శిలాఫలకం చూపించి నారా లోకేష్‌ మాట నిలబెట్టుకున్నారని, తమకు తాగుసాగు నీళ్ళు అందించినందుకు వారు మనసారా నారా లోకేష్‌ని దీవిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌, వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తుంటే, ఇలా ఒక్కో హామీ అమలు చేసి చూపిస్తున్నందుకు ప్రజలు వారిని మెచ్చుకుంటున్నారు. కానీ అంగీకరించడానికి జగన్‌కు అహం అడ్డొస్తోంది.

ADVERTISEMENT
Latest Stories